News September 22, 2025

చెన్నయ్ షాపింగ్ మాల్‌లో దసరా సంబరాలు

image

HYD: దసరా, దీపావళి సందర్భంగా ప్రత్యేక సంబరాలు ప్రారంభించినట్లు చెన్నయ్ షాపింగ్ మాల్ యాజమాన్యం తెలిపింది. అందుబాటు ధరల్లో సరికొత్త కలెక్షన్స్, షాపింగ్ చేసిన వినియోగదారులకు ప్రత్యేక బహుమతులు ఉన్నట్లు పేర్కొంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వినియోగదారులకు సూచించింది.

Similar News

News September 22, 2025

HYD: తల్లిదండ్రుల హత్య కేసులో నిందితుడికి రిమాండ్‌

image

మల్కాజిగిరిలోని <<17789520>>నేరేడ్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌<<>> పరిధి సాయినగర్‌లో నివసించే రాజయ్య, లక్ష్మీ దంపతుల కుమారుడు శ్రీనివాస్‌ ఆదివారం మద్యం మత్తులో తల్లిదండ్రులతో గొడవ పడి, వారిని చంపిన విషయం తెలిసిందే. స్థానికులు శ్రీనివాస్‌ను చితకబాది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడిని అరెస్ట్‌ చేశారు. సోమవారం అతడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం అతడికి రిమాండ్‌ విధించింది.

News September 22, 2025

GHMC వ్యాప్తంగా ప్రజావాణికి 156 విన్నపాలు

image

HYD ఖైరతాబాద్‌లోని GHMC ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజావాణికి మొత్తం 156 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వినతులను అధికారులు స్వీకరించారు. సత్వర పరిష్కారానికి సంబంధిత విభాగాల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కాగా మేయర్, కమిషనర్ రాకపోవడంతో పలువురు ఫిర్యాదుదారులు వెనక్కి వెళ్లిపోయారు.

News September 22, 2025

ప్రజావాణి అర్జీలకు వెంటనే స్పందించండి: HYD కలెక్టర్

image

HYD జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అధ్యక్షతన సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన 167 దరఖాస్తులను స్వీకరించారు. హౌసింగ్‌ (99), పెన్షన్స్‌ (31), రెవెన్యూ (16), ఇతర శాఖల (21) అర్జీలు అందాయి. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు శాఖల వారీగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా దివ్యాంగులు, వయోవృద్ధుల అర్జీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.