News September 22, 2025

ఆప్కో వస్త్రాలపై 40% డిస్కౌంట్: మంత్రి సవిత

image

AP: దసరా, దీపావళి సందర్భంగా APCO వస్త్రాలపై 40% రిబేట్ అందిస్తున్నట్లు చేనేత, జౌళి మంత్రి సవిత ప్రకటించారు. సంస్థ షోరూములలో ఈ రాయితీ అమలవుతుందని తెలిపారు. ఈ కామర్స్‌లో అమ్మకాలతో పాటు డోర్ డెలివరీ కూడా ఆప్కో చేస్తుందన్నారు. చేనేత వస్త్రాలు తెలుగు సంస్కృతికి ప్రతిబింబమని, ఈ నిర్ణయంతో ప్రజలకు మేలు కలుగుతుందని చెప్పారు. అదే సమయంలో కొనుగోళ్లు పెరిగి చేనేత కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తుందన్నారు.

Similar News

News September 22, 2025

రేపు, ఎల్లుండి భారీ వర్షాలు: APSDMA

image

AP: రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బుధవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.

News September 22, 2025

వయసు కాదు.. ధైర్యమే ముఖ్యం!

image

ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అని నిరూపించారు 77 ఏళ్ల రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ సోహన్ రాయ్. పుణేకు చెందిన సోహన్ తన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఉమ్లింగ్ లాను అధిరోహించి ఔరా అనిపించారు. లద్దాక్‌లోని 19,024 అడుగుల ఎత్తైన ఈ ప్రాంతానికి ఆయన చేసిన ప్రయాణం సాహసానికి, సంకల్పానికి నిదర్శనంగా నిలిచింది. ఇక్కడి భిన్నమైన వాతావరణంతో పాటు ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి.

News September 22, 2025

యూరియాతో తీవ్ర నష్టం: సీఎం

image

AP: యూరియా ఎక్కువగా వాడటం వల్ల పాలు కూడా కలుషితం అవుతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. ‘యూరియా వల్ల ప్రజారోగ్యం, పంట ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. రసాయనాలు, యూరియా అధిక వినియోగంపై రైతుల్ని చైతన్యపర్చాల్సి ఉంది. బాధ్యతలేని నాయకులు ఎరువులు ఇవ్వలేదని వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సర్టిఫికేషన్ ఇచ్చిన ఆహారాన్నే తీసుకుంటున్న ఆ నేతలు రైతులను మోసగిస్తున్నారు’ అని అసెంబ్లీలో విమర్శించారు.