News September 22, 2025

450కి పైగా ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా: కన్నబాబు

image

తుళ్లూరు స్కిల్ హబ్‌లో ఈ నెల 24న 5 ప్రముఖ కంపెనీలలో 450కి పైగా ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నామని CRDA కమిషనర్ కన్నబాబు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని APSSDC సౌజన్యంతో నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. SSC, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీ.ఫార్మసీ పూర్తి చేసిన వారు ఈ జాబ్ మేళాకు హాజరు కావచ్చన్నారు. ఎంపికైన అభ్యర్థులు అమరావతి, VJA, HYDలో పనిచేయాల్సి ఉంటుందన్నారు.

Similar News

News September 22, 2025

ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చేయాలి: ADB SP

image

ఆదిలాబాద్ పోలీసు ముఖ్య కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు ఎస్పీ అఖిల్ మహాజన్ ను నేరుగా కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. సమస్యలను విన్న ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలిచ్చి బాధితుల సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రతి ఒక్క సమస్యను పరిశీలించి శాశ్వతంగా పరిష్కారం చూపాలని ఆదేశించారు. మొత్తం 43 ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు.

News September 22, 2025

పార్వతీపురం: ఏడాదికి మూడు పంటలు వేసేలా ప్రణాళికలు చేయాలి

image

జిల్లాలోని రైతులు ఏడాదికి మూడు పంటలు వేసేలా ప్రణాళికలు చేయాలని జిల్లా కలెక్టర్డా.ఎన్.ప్రభాకర రెడ్డి వ్యవసాయాధికారులను ఆదేశించారు. ముఖ్యంగా వాణిజ్య పంటలపై రైతులు దృష్టి సారించేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.

News September 22, 2025

ప్రత్యేక నిపుణుల వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి: ADB కలెక్టర్

image

ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం SNSPA కార్యక్రమంలో భాగంగా ప్రజల కోసం ప్రత్యేక నిపుణుల వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఆయా మండలాల్లో నిర్వహిస్తున్న శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్త్రీ, చిన్న పిల్లల కంటి, చర్మ, పళ్ల సమస్యలు, చెవి-ముక్కు-గొంతు వ్యాధులు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.