News September 22, 2025
450కి పైగా ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా: కన్నబాబు

తుళ్లూరు స్కిల్ హబ్‌లో ఈ నెల 24న 5 ప్రముఖ కంపెనీలలో 450కి పైగా ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నామని CRDA కమిషనర్ కన్నబాబు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని APSSDC సౌజన్యంతో నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. SSC, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీ.ఫార్మసీ పూర్తి చేసిన వారు ఈ జాబ్ మేళాకు హాజరు కావచ్చన్నారు. ఎంపికైన అభ్యర్థులు అమరావతి, VJA, HYDలో పనిచేయాల్సి ఉంటుందన్నారు.
Similar News
News September 22, 2025
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కామారెడ్డి కలెక్టర్

జాతీయ రహదారుల నిర్మాణానికి భూసేకరణ, అటవీ భూముల కేటాయింపు, కోర్టు సమస్యలు ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. సోమవారం ముఖ్యమంత్రి, మంత్రి కోమటిరెడ్డి, సీఎస్ రామకృష్ణారావు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దసరాకు ముందు పనులు పూర్తి చేయాలని, రైతులకు వెంటనే పరిహారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అధికారులు పాల్గొన్నారు.
News September 22, 2025
దసరా ఎఫెక్ట్.. ప్రయాణికులతో కిక్కిరిసిన బస్సులు

దసరా ఉత్సవాల ఎఫెక్ట్‌తో ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. నేటి నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో పండగకు సొంత ఊరుకి వెళ్లే ప్రయాణికులతో వాహనాలు కిటాకిలాడుతున్నాయి. సమయానికి బస్సులు లేకపోవడం, ఉన్న బస్సులు సరిపోకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. సోమవారం రాత్రి పాయకరావుపేటలోని బస్ స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసింది.
News September 22, 2025
రేపు, ఎల్లుండి భారీ వర్షాలు: APSDMA

AP: రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బుధవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.