News September 22, 2025
HYD: మరో 3 గంటలు జర జాగ్రత్త..!

గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ వర్షం దంచికొడుతోంది. రానున్న 2-3 గంటలు ఈ వర్షం ఇలాగే కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. మీ ప్రాంతంలో వర్షం కురుస్తుందా కామెంట్ చేయండి. SHARE IT
Similar News
News September 23, 2025
శ్రీకాకుళం: లుక్ ఎట్ టుడే టాప్ న్యూస్

✦ DSCలో ఎంపికైన అభ్యర్థులకు డీఈఓ ముఖ్య సూచనలు
✦రాష్ట్ర పండుగ కొత్తమ్మతల్లి ఉత్సవాలకు సర్వం సిద్ధం
✦నందిగాం: ఈఎంఐ కట్టలేదని ఇంటికి తాళం వేశారు
✦శ్రీకాకుళం: ఎస్పీ గ్రీవెన్స్‌కు 63 అర్జీలు
✦జిల్లా వ్యాప్తంగా ప్రారంభం అయిన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
✦శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ వర్షాలు
✦ గుంతలమయంగా మారిన కొత్తపేట జంక్షన్ రోడ్డు
News September 23, 2025
రాయికల్ : భళా.. ఒగ్గు కళాకారుల నృత్యాలు

రాయికల్ మండలం రామాజీపేటలో నవదుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన దుర్గామాత ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఒగ్గు కళాకారుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామంలోని మహిళలు మంగళహారతులతో అమ్మవారికి స్వాగతం పలికారు. అనంతరం గ్రామ పురోహితుడు మధు శర్మ ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో నవదుర్గా సేవా సమితి సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
News September 22, 2025
టంగుటూరు వద్ద ప్రమాదం.. ఇద్దరి మృతి

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు వెళ్తున్న బైక్- లారీ ఢీకొన్నాయి. టంగుటూరి SI నాగమల్లేశ్వరరావు గాయాలైనవారిని ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వారు మృతి చెందారు. మృతులు పుల్లారెడ్డిపాలెంకి చెందిన బొడ్డు వెంకటేశ్వర్లు, వెంకటాయపాలెంకి చెందిన చొప్పర శ్రీనుగా గుర్తించారు.