News September 22, 2025

రాయికల్: ఆదివాసి తోటి సంక్షేమ జిల్లా అధ్యక్షుడిగా ప్రసన్నకుమార్

image

ఆదివాసి తోటి సంక్షేమ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడిగా రాయికల్‌కు చెందిన కురిసెంగ ప్రసన్నకుమార్‌ను నియమించినట్లు రాష్ట్ర కన్వీనర్ అత్రం కమల్ మనోహర్ తెలిపారు. తోటి కుల హక్కుల కోసం ప్రసన్నకుమార్ చేసిన కృషిని గుర్తించి ఈ పదవి అప్పగించినట్లు చెప్పారు. పీటీజీ వర్గాల అభివృద్ధి, ఫేక్ కుల సర్టిఫికెట్లపై చర్యలు, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ప్రసన్నకుమార్ పేర్కొన్నారు.

Similar News

News September 22, 2025

MBNR: పాలమూరు యూనివర్సిటీ ఫలితాలు విడుదల

image

మహబూబ్ నగర్ జిల్లాకేంద్రంలోని పాలమూరు విశ్వవిద్యాలయంలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ ఆరో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను వైస్ ఛాన్సలర్ ఆచార్య జిఎన్. శ్రీనివాస్ సోమవారం విడుదల చేశారు. వారు మాట్లాడుతూ.. ఫలితాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని తెలిపారు. కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్, పరీక్షల నియంత్రణ అధికారిణి తదితరులు పాల్గొన్నారు.

News September 22, 2025

సిరిసిల్ల: 108 వాహనాలను తనిఖీ చేసిన ఆడిటింగ్ అధికారి

image

సిరిసిల్లలోని 108 వాహనాలను AMRA గ్రీన్ హెల్త్ సర్వీసెస్ రాష్ట్ర ఆడిటింగ్ అధికారి వెంకటేష్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనాలలో వెంటిలేటర్, మానిటర్, ఇన్ఫ్యూజన్ పంప్, ఆక్సిజన్ సిలిండర్లు, గ్లూకోమీటర్, BP ఆపరేటర్, అత్యవసర పరిస్థితిలో ప్రథమ చికిత్సకు ఉపయోగించే పరికరాల పనితీరును పరిశీలించారు. క్షతగాత్రులకు 24 గంటలు సేవలందిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శ్రీనివాస్, స్వాతి, మదన్, రాజు ఉన్నారు.

News September 22, 2025

తంగళ్ళపల్లి: రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు

image

తంగళ్లపల్లి మండలంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించగా, ముగ్గురికి గాయాలయ్యాయని SI ఉపేంద్ర చారి తెలిపారు. HYD నుంచి KRTLకు వెళ్తున్న గుద్దేటి శ్రీధర్(46), అతని భార్య సునీత ప్రయాణిస్తున్న కారును, మనోహర్ రెడ్డి అనే వ్యక్తి నడుపుతున్న కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. శ్రీధర్ అక్కడికక్కడే మృతి చెందగా, సునీతతోపాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన మనోహర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.