News September 22, 2025
ఓటరు జాబితాలో అభ్యంతరాలు ఉంటే చెప్పాలి: DRO

ఓటరు జాబితాలో అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని అనకాపల్లి DRO సత్యనారాయణరావు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన ఓటరు జాబితా అభ్యంతరాలపై సమావేశం ఏర్పాటు చేశారు. జాబితాలో పొరపాట్లు, తప్పులు ఉంటే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. తప్పులు లేని ఓటరు జాబితా తయారీకి జిల్లా అధికార యంత్రాంగానికి సహకరించాలన్నారు.
Similar News
News September 23, 2025
శ్రీకాకుళం: లుక్ ఎట్ టుడే టాప్ న్యూస్

✦ DSCలో ఎంపికైన అభ్యర్థులకు డీఈఓ ముఖ్య సూచనలు
✦రాష్ట్ర పండుగ కొత్తమ్మతల్లి ఉత్సవాలకు సర్వం సిద్ధం
✦నందిగాం: ఈఎంఐ కట్టలేదని ఇంటికి తాళం వేశారు
✦శ్రీకాకుళం: ఎస్పీ గ్రీవెన్స్‌కు 63 అర్జీలు
✦జిల్లా వ్యాప్తంగా ప్రారంభం అయిన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
✦శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ వర్షాలు
✦ గుంతలమయంగా మారిన కొత్తపేట జంక్షన్ రోడ్డు
News September 23, 2025
రాయికల్ : భళా.. ఒగ్గు కళాకారుల నృత్యాలు

రాయికల్ మండలం రామాజీపేటలో నవదుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన దుర్గామాత ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఒగ్గు కళాకారుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామంలోని మహిళలు మంగళహారతులతో అమ్మవారికి స్వాగతం పలికారు. అనంతరం గ్రామ పురోహితుడు మధు శర్మ ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో నవదుర్గా సేవా సమితి సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
News September 22, 2025
టంగుటూరు వద్ద ప్రమాదం.. ఇద్దరి మృతి

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు వెళ్తున్న బైక్- లారీ ఢీకొన్నాయి. టంగుటూరి SI నాగమల్లేశ్వరరావు గాయాలైనవారిని ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వారు మృతి చెందారు. మృతులు పుల్లారెడ్డిపాలెంకి చెందిన బొడ్డు వెంకటేశ్వర్లు, వెంకటాయపాలెంకి చెందిన చొప్పర శ్రీనుగా గుర్తించారు.