News September 22, 2025

NZB: ఇందిరమ్మ చీర అని పెడితే ఊరుకోం: కవిత

image

మహిళలకు ఇచ్చే చీరలకు బతుకమ్మ చీరలు లేదంటే తెలంగాణ ఆడబిడ్డల చీర అని పేరు పెట్టాలని, ఇందిరమ్మ చీర అని పేరు పెడితే మాత్రం ఊరుకునేది లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, NZB ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో ఆమె మాట్లాడారు. ఆడబిడ్డలకు ఒకటి కాదు, రెండు చీరలిస్తామని గతంలో హామీ ఇచ్చారన్నారు.

Similar News

News September 22, 2025

NZB: ప్రజావాణికి విశేష స్పందన

image

నిజమాబాద్ పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు సీపీ సాయి చైతన్యకు సమస్యలు విన్నవించారు. 29 ఫిర్యాదులను సీపీ స్వీకరించారు. వాటి పరిష్కారానికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రతి సోమవారం ప్రజావాణి ద్వారా నేరుగా పౌరుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు.

News September 22, 2025

సంస్కృతి ప్రతిబింబించేలా బతుకమ్మ సంబరాలు: NZB కలెక్టర్

image

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా బతుకమ్మ సంబురాలను జిల్లాలో వైభోపేతంగా నిర్వహించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం ఆయన వివిధ శాఖల అధికారులతో సమావేశమై బతుకమ్మ వేడుకల నిర్వహణకు చేపట్టాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. జిల్లాలోని అన్ని పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో బతుకమ్మ శోభ ఉట్టిపడేలా వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.

News September 22, 2025

NZB: బైక్ దొంగతనాలకు పాల్పడిన ఇద్దరి అరెస్ట్

image

బైక్ దొంగతనాలకు పాల్పడిన ఇద్దరిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండుక్ తరలించినట్లు నిజామాబాద్ టౌన్-I SHO రఘుపతి తెలిపారు. భైంసాకు చెందిన హనువాతే భీమ్, హనువాతే సుభాష్ NZB 50 క్వార్టర్స్‌లో ఉంటూ మద్యం, జల్సాల కోసం బైక్ దొంగతనాలు చేస్తున్నట్టు చెప్పారు. NZB, భైంసా, నందిపేట్, బాల్కొండ ప్రాంతాల్లో బైక్ దొంగతనాలు చేశారన్నారు. వారి నుంచి 4 బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.