News September 22, 2025

ఆ వేడుకకు పవన్ అన్నను ఆహ్వానించా: లోకేశ్

image

AP: కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలోనే ఇచ్చిన మాట నిలుపుకుందని మంత్రి లోకేశ్ తెలిపారు. ‘Dy.CM పవన్ అన్నను మర్యాదపూర్వకంగా కలిశాను. ఈనెల 25న MEGA DSC విజేతలకు నియామక ఉత్తర్వులు అందించే కార్యక్రమానికి హాజరవ్వాలని ఆహ్వానించాను. గత ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయకపోగా DSCని అడ్డుకోవాలని 87 కేసులు వేశారు. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న నిరుద్యోగ టీచర్ల కలలు సాకారం చేశామని వివరించా’ అని ట్వీట్ చేశారు.

Similar News

News September 23, 2025

మృత్యుంజయుడు.. విమానం టైర్లలో ప్రయాణం

image

కాబూల్ (AFG)నుంచి ఢిల్లీ వరకు (గంటన్నర జర్నీ) ఓ 13 ఏళ్ల బాలుడు విమానం టైర్లలో దాక్కుని ప్రయాణించాడు. ఇరాన్‌కు పారిపోదామని పొరపాటుగా ఢిల్లీకి వెళ్లే RQ4401 విమానం టైర్ భాగంలో కూర్చున్నాడు. ఆ టైర్లతో పాటు
అతడూ లోపలికి వెళ్లి నక్కి ఉంటాడని అధికారులు భావిస్తున్నారు. లేదంటే 30వేల అడుగుల ఎత్తులో ఆక్సిజన్ అందక, గడ్డకట్టే చలిలో చనిపోయేవాడని చెప్పారు. బాలుడు మైనర్ కావడంతో కఠిన చర్యలు ఉండవని తెలిపారు.

News September 22, 2025

‘OG’ విలన్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే!

image

పవన్ ‘OG’ మూవీ విలన్ ఇమ్రాన్ హష్మీ (46) ఓ ఇంటర్వ్యూలో తన ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పారు. ‘వారంలో 5రోజులు జిమ్ చేస్తాను. రోజూ ఓ గంట నడుస్తాను. షుగర్స్ అస్సలు తీసుకోను. లంచ్‌లో కూరగాయలు, పప్పు, రోటీలు తింటాను. నైట్ రోటీలు కూడా తినను. చికెన్ లేదా కూరగాయలు, పప్పు, పెరుగు వంటివి తింటా. ఇప్పుడు రోజులో 16 గం.లు ఫాస్టింగ్ చేస్తున్నా. రోజుకు కనీసం 6 గంటలు నిద్రపోతాను’ అని తెలిపారు.

News September 22, 2025

MP సుధా మూర్తికీ తప్పని సైబర్ వేధింపులు

image

రాజ్యసభ సభ్యురాలు సుధా మూర్తి గుర్తుతెలియని వ్యక్తిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘SEP 5న నాకో వ్యక్తి ఫోన్ చేసి టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగినని చెప్పాడు. నా ఫోన్ నంబర్ ఆధార్‌కు లింక్ కాలేదని అన్నాడు. నాకు సంబంధించిన అభ్యంతరకర వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయన్నాడు. నా ఫోన్ కనెక్షన్ కట్ చేస్తున్నట్లు చెప్పాడు’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.