News September 22, 2025
అర్జీదారులతో కలసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్న అర్జీదారులతో జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి కలిసి భోజనం చేశారు. సోమవారం నంద్యాల కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీదారుల కోసం కాశిరెడ్డి నాయన సత్రం, ఓంకారం వారి ఆధ్వర్యంలో అందజేసే ఉచిత భోజన కార్యక్రమంలో అర్జీదారులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు. అర్జీదారులతో భోజనం చేస్తూ వారి సమస్యలను నేరుగా విన్నారు.
Similar News
News September 23, 2025
సీఎం వీడియో కాన్ఫరెన్స్.. పాల్గొన్న కలెక్టర్

రహదారి నిర్మాణ పనుల్లో ఆలస్యం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్యకు సూచించారు. సోమవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. కోర్టు కేసుల్లో ఉన్నచోట్ల ప్రత్యేక చొరవ తీసుకుని సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, అధికారులు పాల్గొన్నారు.
News September 23, 2025
BREAKING.. కొత్తగూడెంలో వ్యక్తి దారుణ హత్య

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ హత్య జరిగింది. కొత్తగూడెం గణేష్ టెంపుల్ ప్రాంతంలో సింగరేణి విశ్రాంతి కార్మికుడు
మోహన్‌రావును గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 23, 2025
జమ్మికుంట: సినీ నిర్మాత నిమ్మల సతీష్ మృతి

అమ్మ ప్రొడక్షన్స్ అధినేత, సినీ నిర్మాత నిమ్మల సతీష్ సోమవారం అకాలమరణం చెందారు. హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆయన మృతిచెందినట్లు తెలిపారు. సతీష్ ‘టైంపాస్’, ‘దికాప్’ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఆయన మృతిపట్ల దర్శకుడు జీఎస్ గౌతమ్ కృష్ణ, హీరో దీక్షిత్, సూర్యతో పాటు సినీ ప్రముఖులు, పాత్రికేయులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సతీష్ స్వగ్రామం జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి గ్రామం.