News September 22, 2025
భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి: CM

జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. డా.బి.ఆర్.అంబేడ్కర్ సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు జారీ చేశారు. దసరా పండుగకు ముందే అన్ని పనులు పూర్తికావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ స్నేహ శబరీశ్, డీఎఫ్‌వో లావణ్య సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Similar News
News September 23, 2025
జమ్మికుంట: సినీ నిర్మాత నిమ్మల సతీష్ మృతి

అమ్మ ప్రొడక్షన్స్ అధినేత, సినీ నిర్మాత నిమ్మల సతీష్ సోమవారం అకాలమరణం చెందారు. హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆయన మృతిచెందినట్లు తెలిపారు. సతీష్ ‘టైంపాస్’, ‘దికాప్’ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఆయన మృతిపట్ల దర్శకుడు జీఎస్ గౌతమ్ కృష్ణ, హీరో దీక్షిత్, సూర్యతో పాటు సినీ ప్రముఖులు, పాత్రికేయులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సతీష్ స్వగ్రామం జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి గ్రామం.
News September 23, 2025
దుర్గోత్సవాల్లో డీజేలు, టపాసులు నిషేధం: ఎస్పీ

దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శాంతిభద్రతల పరిరక్షణకు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఉత్సవాల్లో టపాసులు, డీజేలను నిషేధించినట్లు ఆయన పేర్కొన్నారు. చిన్నపాటి లౌడ్‌స్పీకర్లకు మాత్రమే అనుమతి ఉంటుందని, రాత్రి 10 గంటల తర్వాత వాటిని కూడా నిలిపివేయాలని సూచించారు. ఈ నిబంధనలను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
News September 23, 2025
KNR: ‘పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి’

“ప్రజావాణి”లో భాగంగా సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మి కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. 318 అర్జీలు రాగా సత్వర పరిష్కారం కోసం వాటిని వివిధ శాఖల అధికారులకు బదిలీ చేశారు. పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.