News September 22, 2025
NZB: బైక్ దొంగతనాలకు పాల్పడిన ఇద్దరి అరెస్ట్

బైక్ దొంగతనాలకు పాల్పడిన ఇద్దరిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండుక్ తరలించినట్లు నిజామాబాద్ టౌన్-I SHO రఘుపతి తెలిపారు. భైంసాకు చెందిన హనువాతే భీమ్, హనువాతే సుభాష్ NZB 50 క్వార్టర్స్‌లో ఉంటూ మద్యం, జల్సాల కోసం బైక్ దొంగతనాలు చేస్తున్నట్టు చెప్పారు. NZB, భైంసా, నందిపేట్, బాల్కొండ ప్రాంతాల్లో బైక్ దొంగతనాలు చేశారన్నారు. వారి నుంచి 4 బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News September 23, 2025
నిజామాబాద్: డా.కాసర్ల, చందన్ రావులకు కాళోజీ జాతీయ పురస్కారం

నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ కవులు డా.కాసర్ల నరేష్ రావు, వ్యాఖ్యాత చందన్ రావులకు సోమవారం కాళోజీ జాతీయ పురస్కారం లభించింది. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో వసుంధర ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో వారికి ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి ఏనుగు నరసింహ రెడ్డి, ఫౌండేషన్ ఛైర్మన్ మధుకర్, రాష్ట్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి బాల చారి పాల్గొన్నారు.
News September 23, 2025
హైదరాబాద్‌పై నిజామాబాద్ విజయం

వనపర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 20 నుంచి 22 వరకు జరిగిన 11వ సెపక్ తక్రా సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ మహిళల, పురుషుల టోర్నమెంట్‌లో నిజామాబాద్ జిల్లా మహిళల జట్టు ప్రథమ స్థానం, పురుషుల జట్టు తృతీయ స్థానం సాధించిందని NZB జిల్లా సేపక్ తక్రా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గాదరి సంజీవరెడ్డి తెలిపారు. మహిళల జట్టు ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టుపై ఘన విజయం సాధించిందని పేర్కొన్నారు.
News September 23, 2025
NZB: ఫుట్ బాల్ క్రీడా పోటీలకు 24న జిల్లా జట్టు ఎంపిక: DIEO

స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 25, 26, 27 తేదీల్లో జనగాంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి అండర్ 19 ఫుట్ బాల్ (బాలుర) క్రీడా పోటీల కోసం ఈ నెల 24న జిల్లా జట్టు ఎంపిక చేయనున్నట్టు NZB జిల్లా ఇంటర్ విద్య అధికారి (DIEO) తిరుమలపూడి రవికుమార్ తెలిపారు. ఇందు కోసం జూనియర్ కళాశాల స్థాయి బాలురు 24న ఉదయం 10 గంటలకు నిజామాబాద్‌లోని రాజారాం క్రీడా స్టేడియం మైదానానికి హాజరు కావాలని సూచించారు.