News September 22, 2025

నంద్యాల: పీజీఆర్ఎస్‌కు 220 దరఖాస్తులు

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో నిశితంగా పరిశీలించి సంతృప్త స్థాయిలో వేగవంతంగా, నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి 220 అర్జీలు స్వీకరించారు. అధికారులు అర్జీలను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

Similar News

News September 23, 2025

ఈ గవర్నెన్స్ సదస్సులో ఉత్తమ పంచాయతీలకు అవార్డ్స్

image

విశాఖలో నిర్వహించిన ఈ-గవర్నెన్స్ సదస్సులో ఉత్తమ పంచాయతీలకు కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అవార్డులను అందజేశారు.
గోల్డ్ అవార్డు : రోహిణి పంచాయితీ, Dhule జిల్లా, మహారాష్ట్ర
సిల్వర్ అవార్డు : West Majlishpur పంచాయతీ, వెస్ట్ త్రిపుర, త్రిపుర
జ్యారీ అవార్డు: 1.Suakati పంచాయతీ, Kendujhar జిల్లా, ఒరిస్సా
2.Palsana పంచాయితీ, సూరత్ జిల్లా, గుజరాత్
సర్పంచులు అవార్డులను స్వీకరించారు.

News September 23, 2025

HEADLINES

image

*యూరియాతో ఆరోగ్యానికి తీవ్ర నష్టం: సీఎం చంద్రబాబు
*TG: సమ్మక్కసాగర్ ప్రాజెక్టుకు లైన్ క్లియర్
*స్వదేశీ వస్తువులనే కొనండి: ప్రజలకు PM లేఖ
*TG: సింగరేణి కార్మికులకు రూ.1,95,610 చొప్పున బోనస్
*మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దుర్మార్గం: బొత్స
*ENCOUNTER: మావోయిస్టు నేతలు రామచంద్రారెడ్డి, సత్యనారాయణ రెడ్డి హతం

News September 23, 2025

రిజర్వేషన్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్‌

image

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రిజర్వేషన్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. సోమవారం ఆసిఫాబాద్‌ కలెక్టరేట్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్ల ప్రక్రియపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు పాల్గొన్నారు. రిజర్వేషన్ల విధివిధానాలపై వారికి కలెక్టర్‌ దిశానిర్దేశం చేశారు