News September 22, 2025
రామగుండం: సైబర్ వారియర్స్‌కు సీపీ ప్రోత్సాహం

సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సైబర్ వారియర్స్‌ను పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కోరారు. సోమవారం జరిగిన సమావేశంలో వారికి టీజీసీఎస్‌బీ పంపిన టీషర్టులను పంపిణీ చేశారు. ఇటీవల 134 కేసుల్లో ₹41.81 లక్షలు బాధితులకు తిరిగి వచ్చినట్లు ఆయన తెలిపారు. ఉత్తమంగా పనిచేసిన నలుగురు కానిస్టేబుళ్లకు ప్రశంసాపత్రాలు అందజేశారు.
Similar News
News September 23, 2025
సంగారెడ్డిలో హోంగార్డుల సమస్యల పరిష్కారానికి కృషి: ఎస్పీ

పోలీస్ శాఖలో పనిచేసే హోంగార్డుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సంగారెడ్డి ఎస్పీ పారితోష్ పంకజ్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో హోంగార్డులకు జాకెట్స్, రెయిన్ కోట్లను సోమవారం పంపిణీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. డ్యూటీల విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉన్న నేరుగా తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రావు, తదితరులు పాల్గొన్నారు.
News September 23, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 23, మంగళవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.53 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.05 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.08 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.30 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.11 గంటలకు
✒ ఇష: రాత్రి 7.24 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News September 23, 2025
మెదక్: ‘అధిక యూరియాతో పంటలకు తెగుళ్లు’

మోతాదుకు మించి ఎరువులు వాడటం వల్ల పంటలకు తెగుళ్లు సోకే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ తెలిపారు. సోమవారం నర్సాపూర్‌లోని రైతు ఆగ్రో సేవా కేంద్రం వద్ద యూరియా సరఫరాను ఆయన పరిశీలించారు. అధిక యూరియా వాడకం వల్ల చీడపీడలు పెరిగి, ఖర్చులు పెరిగిపోతాయని, రాబడి తగ్గుతుందని రైతులకు వివరించారు.