News September 22, 2025

బాపట్ల: ఎస్పీ కార్యాలయానికి 65 అర్జీలు

image

బాపట్ల పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRSకు 65 అర్జీలు వచ్చినట్లు ఎస్పీ ఉమామహేశ్వర్ చెప్పారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వద్ద ఆయన వినతి పత్రాలు స్వీకరించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలువురు బాధితులు ఆయన దగ్గరకు వెళ్లలేక ఇబ్బంది పడగా, ఆయనే వచ్చి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

Similar News

News September 23, 2025

24 ఏళ్లలో మోదీ ఒక్క సెలవు తీసుకోలేదు: అమిత్ షా

image

గత 24 ఏళ్లలో మోదీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. నిర్విరామమైన పని PM నిర్ణయాలపై, పనివేగంపై ప్రభావం చూపలేదన్నారు. కఠినమైన లక్ష్యాలతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. పార్టీలో ఎలాంటి బాస్ కల్చర్ లేదన్నారు. మోదీ నాయకత్వంలో 2047 నాటికి స్వావలంబన భారత్ విజన్‌ను నిర్దేశించుకున్నామన్నారు. అధికారంలో ఉన్నా, లేకున్నా దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని ఆయన చెప్పారు.

News September 23, 2025

సెప్టెంబర్ 23: చరిత్రలో ఈరోజు

image

1976: దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ జననం
1985: క్రికెటర్ అంబటి రాయుడు జననం
1993: నటి షాలిని పాండే జననం
1996: నటి సిల్క్ స్మిత మరణం(ఫొటో)
2019: నటుడు కోసూరి వేణుగోపాల్ మరణం
✤అంతర్జాతీయ సంజ్ఞా భాషల దినోత్సవం

News September 23, 2025

వరంగల్: అమ్మాయిలూ.. మౌనంగా ఉండకండి!

image

ఎవరైనా ఆకతాయిలు మహిళలు, విద్యార్థినులను వేధిస్తే తక్షణమే షీ టీం పోలీసులకు సమాచారం ఇవ్వాలని షీ టీం ఎస్సై యాదగిరి తెలిపారు. వరంగల్ షీ టీం ఆధ్వర్యంలో వరంగల్ వస్త్ర దుకాణంలో షీ టీంతో పాటు డయల్ 100, మహిళల అక్రమ రవాణా, బాల్య వివాహాలు, సైబర్ క్రైం, టీసేఫ్ యాప్‌పై షాపు సిబ్బందికి అవగాహన కల్పించారు. ఎవరైనా వేధిస్తే మౌనంగా ఉండకుండా షీ టీంకు తెలపాలని ఎస్సై సూచించారు.