News September 22, 2025

GHMC వ్యాప్తంగా ప్రజావాణికి 156 విన్నపాలు

image

HYD ఖైరతాబాద్‌లోని GHMC ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజావాణికి మొత్తం 156 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వినతులను అధికారులు స్వీకరించారు. సత్వర పరిష్కారానికి సంబంధిత విభాగాల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కాగా మేయర్, కమిషనర్ రాకపోవడంతో పలువురు ఫిర్యాదుదారులు వెనక్కి వెళ్లిపోయారు.

Similar News

News September 23, 2025

వరంగల్: అమ్మాయిలూ.. మౌనంగా ఉండకండి!

image

ఎవరైనా ఆకతాయిలు మహిళలు, విద్యార్థినులను వేధిస్తే తక్షణమే షీ టీం పోలీసులకు సమాచారం ఇవ్వాలని షీ టీం ఎస్సై యాదగిరి తెలిపారు. వరంగల్ షీ టీం ఆధ్వర్యంలో వరంగల్ వస్త్ర దుకాణంలో షీ టీంతో పాటు డయల్ 100, మహిళల అక్రమ రవాణా, బాల్య వివాహాలు, సైబర్ క్రైం, టీసేఫ్ యాప్‌పై షాపు సిబ్బందికి అవగాహన కల్పించారు. ఎవరైనా వేధిస్తే మౌనంగా ఉండకుండా షీ టీంకు తెలపాలని ఎస్సై సూచించారు.

News September 23, 2025

మరోసారి క్యాబ్ అధ్యక్షుడిగా గంగూలీ

image

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ గంగూలీ మరోసారి బెంగాల్ క్రికెట్ సంఘం(CAB) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నిన్న జరిగిన క్యాబ్ 94వ వార్షిక సదస్సుల్లో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2015-19లో దాదా CAB అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఈడెన్ గార్డెన్ సీట్ల సామర్థ్యం పెంపుపై ఆయన ఫోకస్ చేయనున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో దక్షిణాఫ్రికా-టీమ్ ఇండియా తొలి టెస్టు ఈడెన్‌లోనే జరగనుంది. చివరగా 2019లో ఇక్కడ టెస్టు మ్యాచ్ జరిగింది.

News September 23, 2025

మేడారానికి జాతీయ హోదా దక్కేనా..?

image

తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు జాతీయ పండుగ హోదా దక్కాలనే ప్రజల ఆకాంక్ష నెరవేరట్లేదు. గత దశాబ్ధ కాలంగా కేంద్ర ప్రభుత్వానికి చేస్తున్న వినతులు సత్ఫలితాలు ఇవ్వట్లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మేడారం జాతర విశిష్ఠతను విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. జాతీయ పండుగ హోదా దక్కితే అపరిమిత అభివృద్ధి జరుగుతుందని ఆశించారు. ఈ సరైనా కేంద్రం స్పందించి జాతీయ హోదా ఇస్తుందో చూడాలి.