News September 22, 2025
ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెంచాలి: డీఎంహెచ్‌ఓ

ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్యను పెంచడానికి చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌ఓ జయలక్ష్మి అన్నారు. సోమవారం పాల్వంచలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె సూచనలు చేశారు గర్భిణీలను తప్పనిసరిగా నమోదు చేయాలని ఆమె ఆదేశించారు. శిశువులకు పూర్తి స్థాయిలో టీకాలు అందేలా చూడాలని కోరారు. ఈ సమావేశంలో డాక్టర్ పుల్లారెడ్డి పాల్గొన్నారు.
Similar News
News September 23, 2025
దిలావర్పూర్: మాతాన్నపూర్ణ దేవిగా పార్వతీదేవి

దిలావర్పూర్ మండలం కదిలి మాత అన్నపూర్ణేశ్వరి ఆలయానికి విశిష్ఠ చరిత్ర ఉంది. పార్వతీదేవి శివుడితో కలిసి ఈ స్థలంలో మాత అన్నపూర్ణేశ్వరిగా కొలువై ఉంది. దక్షిణం వైపు ముఖం కలిగి అమ్మవారు కొలువయ్యారు. అందుకే ఇక్కడ ఏడాది పొడుగునా అన్నదానం నిర్వహిస్తారు. దేవీ నవరాత్రులలో ఇక్కడ హోమాలు, పూజలు చేయడంతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు దర్శించుకుంటారు. 9 రోజులు నిష్ఠతో పూజలు ఆచరిస్తారు.
News September 23, 2025
24 ఏళ్లలో మోదీ ఒక్క సెలవు తీసుకోలేదు: అమిత్ షా

గత 24 ఏళ్లలో మోదీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. నిర్విరామమైన పని PM నిర్ణయాలపై, పనివేగంపై ప్రభావం చూపలేదన్నారు. కఠినమైన లక్ష్యాలతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. పార్టీలో ఎలాంటి బాస్ కల్చర్ లేదన్నారు. మోదీ నాయకత్వంలో 2047 నాటికి స్వావలంబన భారత్ విజన్‌ను నిర్దేశించుకున్నామన్నారు. అధికారంలో ఉన్నా, లేకున్నా దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని ఆయన చెప్పారు.
News September 23, 2025
సెప్టెంబర్ 23: చరిత్రలో ఈరోజు

1976: దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ జననం
1985: క్రికెటర్ అంబటి రాయుడు జననం
1993: నటి షాలిని పాండే జననం
1996: నటి సిల్క్ స్మిత మరణం(ఫొటో)
2019: నటుడు కోసూరి వేణుగోపాల్ మరణం
✤అంతర్జాతీయ సంజ్ఞా భాషల దినోత్సవం