News September 22, 2025
SRPT: బడికి సెలవు.. నాకు కాదు

దసరా సెలవులంటే సరదాగా ఆటపాటలతో గడపాల్సిన వయసులో ఓ బాలిక తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా నిలుస్తున్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. చివ్వెంల మండలం బండమీది చందుపట్లలో జాతీయ రహదారి 365(BB)పై ఈ దృశ్యం కనిపించింది. చందుపట్లలోని ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న ధరావత్ గ్రీష్మ తన తండ్రి వరి పొలానికి మందు కొడుతుండగా, తాను గొర్రెలను మేపుతూ బడిలో ఇచ్చిన హోంవర్క్‌ను రాసుకుంటూ కనిపించింది.
Similar News
News September 23, 2025
జుబీన్ మృతదేహానికి మరోసారి పోస్టుమార్టం

అస్సాం ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్(52) మృతదేహానికి మరో సారి పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు సీఎం హిమంత బిస్వశర్మ తెలిపారు. కొన్ని వర్గాలు ఆయన <<17783688>>మరణంపై<<>> అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సింగపూర్ వైద్యులు ఇచ్చిన డెత్ సర్టిఫికెట్‌పై అనుమానాలు ఉన్నాయని, సీఐడీకి కేసు అప్పగిస్తామని ఇప్పటికే సీఎం చెప్పారు. కాగా ఇవాళ అధికార లాంఛనాలతో జుబీన్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
News September 23, 2025
దిలావర్పూర్: ఇక్కడ కోనేరులో బతుకమ్మల నిమజ్జనం

దిలావర్పూర్‌లో బతుకమ్మను నిమజ్జనం చేసే స్థలానికి ఓ ప్రత్యేకత దాగి ఉంది. పలుచోట్ల బతుకమ్మ నిమజ్జనాలు చెరువుల్లో, నదుల్లో వేస్తారు. కానీ ఇక్కడ చివరి రోజు అంగరంగ వైభవంగా కోలాలతో నృత్యాలు చేస్తూ రేణుక ఎల్లమ్మ కోనేరులో నిమజ్జనం చేస్తారు. ఈ కోనేరుకు చర్మ వ్యాధులను దూరం చేసే మహత్యం ఉందని విశిష్ట నమ్మకం. కోనేరులో బతుకమ్మలు వేయడం వల్ల మరింత శుద్ధి అవుతుందని నమ్మకం.
News September 23, 2025
హన్మకొండ: పచ్చదనం విరిసి.. అవని మురిసి..!

అందమైన ప్రకృతి అంటే ఎవరు ఇష్టపడరు చెప్పండి. చుట్టూ పంట పొలాలు, వాటి మధ్యలో గుట్టలు, ఎత్తైన తాటి చెట్లు, పంట పొలాల్లో పని చేస్తున్న రైతన్నలు, గొర్రెలను మేపుతున్న కాపరులు. ఇవన్నీ ఒకే చోట ఉంటే చూడటానికి రెండు కళ్లు సరిపోవనే చెప్పవచ్చు. అలాంటి దృశ్యం మన హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ఎర్రబెల్లి గ్రామ శివారులోని ఇనుపరాతి గుట్టల వద్ద కనివిందు చేస్తోంది. అచ్చం ఓ చిత్రకారుడు గీసిన చిత్రలాగే ఉంది.