News September 22, 2025
మెదక్ ప్రజావాణికి 13 ఫిర్యాదులు

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ అర్జీదారుల నుంచి మొత్తం 13 దరఖాస్తులను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వాటిని చట్ట ప్రకారం పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News September 23, 2025
టేక్మాల్: అక్రమంగా తరలిస్తున్న యూరియా పట్టివేత

అక్రమంగా యూరియాను తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని మెదక్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. సీఐ కృష్ణమూర్తి తన సిబ్బందితో కలిసి దాడి చేసి వాహనంలో ఉన్న 250 యూరియా సంచులను సీజ్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్లాక్ మార్కెట్ చేస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
News September 23, 2025
మెదక్: ‘అధిక యూరియాతో పంటలకు తెగుళ్లు’

మోతాదుకు మించి ఎరువులు వాడటం వల్ల పంటలకు తెగుళ్లు సోకే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ తెలిపారు. సోమవారం నర్సాపూర్‌లోని రైతు ఆగ్రో సేవా కేంద్రం వద్ద యూరియా సరఫరాను ఆయన పరిశీలించారు. అధిక యూరియా వాడకం వల్ల చీడపీడలు పెరిగి, ఖర్చులు పెరిగిపోతాయని, రాబడి తగ్గుతుందని రైతులకు వివరించారు.
News September 22, 2025
ఎస్టీయూ మెదక్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక

ఎస్టీయూ టీఎస్ మెదక్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక జరిగింది. అధ్యక్షుడిగా రాజగోపాల్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా నరేశ్, ఆర్థిక కార్యదర్శిగా కిష్టయ్య, రాష్ట్ర కౌన్సిలర్లుగా శ్రీనివాస్, పోచయ్య, మహేందర్ రెడ్డి, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడిగా కుమార్ శివప్రసాద్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా రవి, భూపతి గౌడ్, అశోక్, నర్సింలు, అరుణ్ కుమార్, రమేశ్ గౌడ్ ఎన్నికయ్యారు.