News September 23, 2025
మృత్యుంజయుడు.. విమానం టైర్లలో ప్రయాణం

కాబూల్ (AFG)నుంచి ఢిల్లీ వరకు (గంటన్నర జర్నీ) ఓ 13 ఏళ్ల బాలుడు విమానం టైర్లలో దాక్కుని ప్రయాణించాడు. ఇరాన్‌కు పారిపోదామని పొరపాటుగా ఢిల్లీకి వెళ్లే RQ4401 విమానం టైర్ భాగంలో కూర్చున్నాడు. ఆ టైర్లతో పాటు
అతడూ లోపలికి వెళ్లి నక్కి ఉంటాడని అధికారులు భావిస్తున్నారు. లేదంటే 30వేల అడుగుల ఎత్తులో ఆక్సిజన్ అందక, గడ్డకట్టే చలిలో చనిపోయేవాడని చెప్పారు. బాలుడు మైనర్ కావడంతో కఠిన చర్యలు ఉండవని తెలిపారు.
Similar News
News February 9, 2026
చెవులు లేకున్నా వింటాయివి!

ప్రత్యేక శరీర ఆకృతి, కండరాల నిర్మాణంతో కొన్ని జీవులు బాహ్య చెవులు లేకున్నా వినగలుగుతాయి. పాములకు దవడ ఎముక ద్వారా లోపలి చెవికి సౌండ్ సిగ్నల్స్ అందుతాయి. సాలీడు కాళ్లపై ఉన్న వెంట్రుకలు వైబ్రేషన్స్ విని అపాయాన్ని పసిగడతాయి. సాలమండర్లు చర్మం, వాటి పుర్రె ఎముకలు.. బల్లుల అంతర్గత శరీరాకృతి వల్ల వినగలుగుతాయి. చాలా రకాల చేపలు సైతం అవి తిరిగే ప్రాంతంలో ప్రత్యేకమైన సిస్టమ్ ఏర్పరచుకొని సౌండ్స్ వింటాయి.
News February 9, 2026
దక్షిణ దిశలో ఇల్లు ఉండకూడదా?

దక్షిణానికి యముడు అధిపతి కావడంతో ఈ దిక్కున ఇల్లు కడితే అశుభమని చాలామంది భయపడతారు. అయితే ఇది అపోహ మాత్రమేనని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘దక్షిణాన ఉన్న స్థలం నివాసానికి పనికిరాదనేది నిజం కాదు. నిర్మాణ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ దిక్కున ఉన్నవాళ్లు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. వాస్తు దోషాలు లేకుండా చూసుకుంటే యమస్థానం నుంచి కూడా మంచి ఫలితాలను పొందవచ్చు’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>
News February 9, 2026
రోహిత్, కోహ్లీకి BCCI షాక్

సెంట్రల్ కాంట్రాక్ట్(2025-26) విషయంలో స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి BCCI షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు A+ కేటగిరీలో ఉన్న వారిద్దరినీ గ్రేడ్ Bలో చేర్చింది. రోకో టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. అటు బుమ్రా, గిల్, జడేజాను మాత్రమే గ్రేడ్ Aలో ఉంచింది.


