News September 23, 2025
NLG: బతుకమ్మ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు

జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో రోజుకో శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు జరగనున్నాయని ఆమె చెప్పారు. ఈ నెల 23న బుద్ధవనంలో ప్రత్యేకంగా బతుకమ్మ ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఉత్సవాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
Similar News
News September 23, 2025
దుర్గోత్సవాల్లో డీజేలు, టపాసులు నిషేధం: ఎస్పీ

దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శాంతిభద్రతల పరిరక్షణకు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఉత్సవాల్లో టపాసులు, డీజేలను నిషేధించినట్లు ఆయన పేర్కొన్నారు. చిన్నపాటి లౌడ్స్పీకర్లకు మాత్రమే అనుమతి ఉంటుందని, రాత్రి 10 గంటల తర్వాత వాటిని కూడా నిలిపివేయాలని సూచించారు. ఈ నిబంధనలను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
News September 23, 2025
గ్రీవెన్స్ డే సమస్యలు త్వరగా పరిష్కరించాలి: ఎస్పీ

నల్గొండ: ప్రజా సమస్యల పరిష్కారానికి పోలీసులు మరింత కృషి చేయాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 37 మంది అర్జీదారులతో ఆయన నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకుని, సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణమే న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజలకు పోలీసు శాఖను మరింత చేరువ చేయడమే తమ లక్ష్యమని ఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు.
News September 23, 2025
ప్రశాంతంగా ఉత్సవాలు జరుపుకోవాలి: ఎస్పీ

నల్గొండ: జిల్లాలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ప్రజలు ఎలాంటి ఆందోళన లేకుండా ఉత్సవాలను జరుపుకోవచ్చని చెప్పారు. బతుకమ్మ సంబరాల్లో మహిళలను, యువతులను వేధించే ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రజలు పోలీసులకు సహకరించి శాంతి భద్రతలను కాపాడాలని ఎస్పీ కోరారు.