News September 23, 2025
రిజర్వేషన్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రిజర్వేషన్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్ల ప్రక్రియపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు పాల్గొన్నారు. రిజర్వేషన్ల విధివిధానాలపై వారికి కలెక్టర్ దిశానిర్దేశం చేశారు
Similar News
News September 23, 2025
MDK: గూగుల్ మ్యాప్ నమ్ముకొని ఇరుక్కుపోయాడు

మెదక్ జిల్లాలో గూగుల్ మ్యాప్ ఆధారంగా ప్రయాణించిన డీసీఎం డ్రైవర్ ఇబ్బందుల్లో పడ్డాడు. ఆదివారం వైజాగ్ నుంచి వడియారం మహావీర్ పేపర్ పరిశ్రమకు వచ్చిన డీసీఎం.. గూగుల్ మ్యాప్ ఆధారంగా వెళ్లగా కుంట కట్టవైపు చూపించింది. ముందుకు వెళ్లగా రైల్వే ట్రాక్ అడ్డు రావడంతో వెనుకకు రివర్స్‌లో వస్తుండగా కట్టపై గుంతలో డీసీఎం ఊరుకుపోయింది. క్రేన్ సహాయంతో డీసీఎంను బయటకు తీశారు.
News September 23, 2025
విజయవాడ శాసనసభా ప్రాంగణంలో మహిళా MLAలు

అనంతపురం జిల్లా మహిళా MLAలు AP అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు. రాప్తాడు MLA పరిటాల, పుట్టపర్తి MLA పల్లె సింధూర రెడ్డి, మంత్రి సవిత శాసనసభ ప్రాంగణంలో జ్ఞాపకంగా ఫోటో తీసుకున్నారు. శింగనమల నియోజకవర్గం MLA బండారు శ్రావణి శ్రీ మహిళా ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు.
News September 23, 2025
ఖానాపూర్: గోదావరికి పోటెత్తిన వరద

ఎస్సారెస్పీకి వచ్చిన వరదను దిగువకు వదలడంతో ఖానాపూర్, కడెం, మామడ మండలాల పరిధిలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. సోమవారం ఎస్సారెస్పీ 40 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో వరద ప్రవాహం మరింత పెరిగింది. ప్రజలు, రైతులు, పశువుల కాపర్లు నదివైపు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.