News September 23, 2025

నిజామాబాద్: డా.కాసర్ల, చందన్ రావులకు కాళోజీ జాతీయ పురస్కారం

image

నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ కవులు డా.కాసర్ల నరేష్ రావు, వ్యాఖ్యాత చందన్ రావులకు సోమవారం కాళోజీ జాతీయ పురస్కారం లభించింది. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో వసుంధర ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో వారికి ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి ఏనుగు నరసింహ రెడ్డి, ఫౌండేషన్ ఛైర్మన్ మధుకర్, రాష్ట్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి బాల చారి పాల్గొన్నారు.

Similar News

News September 23, 2025

హైదరాబాద్‌పై నిజామాబాద్ విజయం

image

వనపర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 20 నుంచి 22 వరకు జరిగిన 11వ సెపక్ తక్రా సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ మహిళల, పురుషుల టోర్నమెంట్‌లో నిజామాబాద్ జిల్లా మహిళల జట్టు ప్రథమ స్థానం, పురుషుల జట్టు తృతీయ స్థానం సాధించిందని NZB జిల్లా సేపక్ తక్రా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గాదరి సంజీవరెడ్డి తెలిపారు. మహిళల జట్టు ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టుపై ఘన విజయం సాధించిందని పేర్కొన్నారు.

News September 23, 2025

NZB: ఫుట్ బాల్ క్రీడా పోటీలకు 24న జిల్లా జట్టు ఎంపిక: DIEO

image

స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 25, 26, 27 తేదీల్లో జనగాంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి అండర్ 19 ఫుట్ బాల్ (బాలుర) క్రీడా పోటీల కోసం ఈ నెల 24న జిల్లా జట్టు ఎంపిక చేయనున్నట్టు NZB జిల్లా ఇంటర్ విద్య అధికారి (DIEO) తిరుమలపూడి రవికుమార్ తెలిపారు. ఇందు కోసం జూనియర్ కళాశాల స్థాయి బాలురు 24న ఉదయం 10 గంటలకు నిజామాబాద్‌లోని రాజారాం క్రీడా స్టేడియం మైదానానికి హాజరు కావాలని సూచించారు.

News September 23, 2025

NZB: బోధన్ చలాన్ స్కాంపై వాణిజ్య పన్నుల కమిషనర్ సమీక్ష

image

బోధన్ చలాన్ స్కాంపై వాణిజ్య పన్నుల కమిషనర్ కె.హరిత సోమవారం నిజామాబాద్‌లో సమీక్ష జరిపారు. చలాన్ స్కాంకు సంబంధించిన పాత బకాయిలపై పలు సూచనలు చేశారు. అలాగే పన్నుల వివరాలు, ఆదాయ లక్ష్య సాధన, GST పన్ను రేట్లలో ఇటీవల జరిగిన మార్పులపై సమగ్ర సమీక్ష జరిపి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా జిల్లాలోని టాక్స్ ప్రాక్టిషనర్స్‌తో కూడా ఆమె సమావేశం నిర్వహించారు.