News September 23, 2025

అక్టోబర్ 2 నుంచి ప్లాస్టిక్ నిషేధం తప్పనిసరి: కలెక్టర్

image

ప.గో జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రముఖ దేవాలయాలలో అక్టోబర్ 2 నుంచి ప్లాస్టిక్ నిషేధం తప్పనిసరి అని కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సింగిల్ యూస్డ్ ప్లాస్టిక్‌ను వినియోగించరాదని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలలో ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించకుండా జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.

Similar News

News September 23, 2025

భీమవరం: ఇ-డివిజనల్ మేనేజర్ పోస్ట్ భర్తీకి దరఖాస్తులు

image

భీమవరం డివిజన్‌కు సంబంధించిన ఇ-డివిజనల్ మేనేజర్ పోస్ట్ భర్తీకి పొరుగు సేవల పద్ధతిలో దరఖాస్తులు చేసుకోవచ్చునని కలెక్టర్ నాగరాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తును అందుబాటులో ఉంచామన్నారు. వాటిని పూరించిన దరఖాస్తులను విద్యార్హత ధృవీకరించబడిన కాపీలతో భీమవరంలోని జిల్లా రెవెన్యూ అధికారి సిసికి అందజేయాలన్నారు. అక్టోబర్ 3‌లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News September 23, 2025

భీమవరం: ఇన్‌ఛార్జి జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారిగా సూరిబాబు

image

జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఇన్‌ఛార్జ్ అధికారిగా ఏవి సూరిబాబు ఇటీవల నియమితులయ్యారు. సోమవారం భీమవరం కలెక్టరేట్‌లో కలెక్టర్ నాగరాణి‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వసతి గృహాల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించడం జరిగిందన్నారు. అన్ని వసతి గృహాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించాలన్నారు.

News September 22, 2025

యథావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రారంభించిన ‘మీ కోసం’ కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని తెలిపారు. ఇంతకుముందు ఇచ్చిన ఫిర్యాదుల స్థితిని తెలుసుకోవడానికి లేదా అవి ఇంకా పరిష్కారం కాకపోతే, అర్జీదారులు 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చని ఆమె సూచించారు.