News September 23, 2025

హైదరాబాద్‌లో డ్రోన్ పోలీసింగ్‌కు సీఎం ఆదేశం

image

హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్ పోలీసింగ్ విధానం అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఆదేశించారు. వెంటనే డ్రోన్లను కొనుగోలు చేయాలని పోలీస్ విభాగానికి సూచించారు. అత్యంత ట్రాఫిక్ రద్దీ ఉండే ప్రాంతాల్లో వీటిని వాడాలని చెప్పారు. డ్రోన్ ద్వారానే వాహనదారులకు సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Similar News

News September 22, 2025

HYD: యువతిపై బ్లేడ్‌తో దాడి చేసింది ఇతడే..!

image

కూకట్‌పల్లి పరిధి <<17796420>>మూసాపేట్ మెట్రో స్టేషన్<<>> కింద యువతిపై యువకుడు బ్లేడ్‌తో దాడి చేసిన ఘటనలో నిందితుడు MDమొహ్సిన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం రాత్రి మెట్రో స్టేషన్ వద్దకు యువతిని రమ్మని పిలిచి విచక్షణరహితంగా బ్లేడుతో దాడి చేశాడు. ప్రస్తుతం యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.కేసు నమోదు చేసిన కూకట్‌పల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం యువతి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు.

News September 22, 2025

HYD: తల్లిదండ్రుల హత్య కేసులో నిందితుడికి రిమాండ్‌

image

మల్కాజిగిరిలోని <<17789520>>నేరేడ్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌<<>> పరిధి సాయినగర్‌లో నివసించే రాజయ్య, లక్ష్మీ దంపతుల కుమారుడు శ్రీనివాస్‌ ఆదివారం మద్యం మత్తులో తల్లిదండ్రులతో గొడవ పడి, వారిని చంపిన విషయం తెలిసిందే. స్థానికులు శ్రీనివాస్‌ను చితకబాది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడిని అరెస్ట్‌ చేశారు. సోమవారం అతడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం అతడికి రిమాండ్‌ విధించింది.

News September 22, 2025

GHMC వ్యాప్తంగా ప్రజావాణికి 156 విన్నపాలు

image

HYD ఖైరతాబాద్‌లోని GHMC ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజావాణికి మొత్తం 156 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వినతులను అధికారులు స్వీకరించారు. సత్వర పరిష్కారానికి సంబంధిత విభాగాల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కాగా మేయర్, కమిషనర్ రాకపోవడంతో పలువురు ఫిర్యాదుదారులు వెనక్కి వెళ్లిపోయారు.