News September 23, 2025
శ్రీశైలంలో అలరిస్తున్న కళారూపాలు

శ్రీశైల మహా క్షేత్రంలో కన్నుల పండువగా దసరా మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు శైలపుత్రి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వగా.. స్వామి, అమ్మవార్లు బృంగి వాహనంపై విహరించారు. ఈ సందర్భంగా వివిధ కళారూపాలు భక్తులను ఎంతగానో అలరించాయి. దేవతామూర్తుల రూపాలు, విచిత్ర వేషధారణ, వివిధ సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి.
Similar News
News September 23, 2025
బ్లూ ఎడ్జ్ ఆఫ్ ఐటీ అండ్ ఇన్నోవేషన్‌గా విశాఖ: కాటమనేని

విశాఖను ప్రపంచ స్థాయి ఐటీ, ఇన్నోవేషన్ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఈ-గవర్నెన్స్ కాన్ఫరెన్స్‌లో వక్తలు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం విశాఖలో విప్రో, టెక్ మహీంద్రా, కాగ్నిజెంట్, అదానీ, ఇన్ఫోసిస్, మౌరి టెక్ వంటి కంపెనీలు పనిచేస్తున్నాయని రాష్ట్ర ITE&C కార్యదర్శి కటామనేని భాస్కర్ తెలిపారు. విశాఖను ‘బ్లూ ఎడ్జ్ ఆఫ్ ఐటీ అండ్ ఇన్నోవేషన్’గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని కటంనేని స్పష్టం చేశారు.
News September 23, 2025
మరో 2 గంటల్లో వర్షం

తెలంగాణలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. నిన్న <<17794672>>హైదరాబాద్<<>> సహా పలు జిల్లాల్లో వాన దంచికొట్టిన విషయం తెలిసిందే. ఇవాళ కూడా కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తెలిపింది. మేడ్చల్, వరంగల్, ఆదిలాబాద్, హన్మకొండ, మహబూబాబాద్, నిర్మల్, సూర్యాపేట జిల్లాల్లో రాబోయే 2 గంటల్లో మోస్తరు వాన పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. మీ ఏరియాలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి.
News September 23, 2025
VJA: దుర్గమ్మ ప్రసాదం .. నేతి లడ్డూ తయారీ ఇలా.!

విజయవాడ దుర్గమ్మ నేతి లడ్డూ అంటే భక్తులకు అత్యంత ఇష్టం. ఈ ఏడాది ఏకంగా రికార్డు స్థాయిలో 36 లక్షల లడ్డూలు సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది కొత్తగా ఆలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న ప్రసాదాల పోటు భవనంలో లడ్డూ తయారీని ఆరంభించారు. ఈసారి విశాలమైన నూతన భవనం ఆరంభించారు. ఎంతో శుభ్రత పాటిస్తూ.. స్వచ్ఛమైన.. రుచికరమైన ప్రసాదం తయారు చేస్తున్నారు.