News September 23, 2025
నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో విరిగిన కుర్చీలు..

నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు కనీస వసతులు కూడా ఉండడం లేదు. రోగులు, వారి అటెండర్లు కూర్చునేందుకు కుర్చీలు సైతం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోగులు కోసం ఏర్పాటు చేసిన కుర్చీలు విరిగిపోయి, నిరుపయోగంగా ఉన్నాయి. ఆసుపత్రి ఓపీ బ్లాక్‌లో నడిచే మార్గంలో ఉన్న చాలా కుర్చీలు ఇదే పరిస్థితిలో ఉన్నాయి. విరిగిన కుర్చీలకు మరమ్మతులు చేయించాలని వారు కోరుతున్నారు.
Similar News
News September 22, 2025
పెంచలకోనలో ప్రారంభమైన దసరా నవరాత్రి ఉత్సవాలు

రాపూరు మండలంలోని పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో సోమవారం దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారు సౌభాగ్యలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. దసరా నవరాత్రుల సందర్భంగా భక్తులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో విచ్చేశారు. అమ్మవారిని దర్శించుకొని ప్రసాదాలను స్వీకరించారు.
News September 22, 2025
నెల్లూరు: మద్దతు ధర లేక రైతుల కష్టాలు!

జిల్లాలోని వరి రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. మిల్లర్లు, దళారులు కనీస మద్దతు ధర కంటే తక్కువగా, పుట్టి రూ.15 వేలకే ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఎకరాకు రూ.16,520 నష్టం వాటిల్లుతోంది. వర్షాల కారణంగా ధాన్యం రంగు మారిందని సాకుతో రేట్లు తగ్గిస్తున్నారు. ఇప్పటికీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు దోపిడీకి గురవుతున్నారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా జోక్యం చేసుకోవాలంటున్నారు.
News September 22, 2025
నెల్లూరు: మా ధాన్యం కొనేదెవరు మహాప్రభో…!

పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేక, గిట్టుబాటు ధర అందక రైతులు లబో.. దిబోమంటున్నారు. ముఖ్యంగా నెల్లూరు రూరల్ మండలంలో ఈ దుస్థితి నెలకొంది. ప్రభుత్వం కొనుగోలు ధరను ప్రకటించినా ఆ ధరకు ఎవరూ కొనడంలేదని వాపోతున్నారు. ధాన్యాన్ని దాచుకోవడానికి గోడౌన్లు లేవని ఆవేదన చెందుతున్నారు. అసలే వర్షాలు పడుతున్నాయని, ఇదే అదునుగా దళారులు అతి తక్కువ ధరకు అడుగుతున్నారని, తమకు గిట్టుబాటు ధర ఇప్పించాలని కోరుతున్నారు.