News September 23, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 23, మంగళవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.53 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.05 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.08 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.30 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.11 గంటలకు
✒ ఇష: రాత్రి 7.24 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News February 8, 2026
నింగిలో నిఘా: శత్రు ఉపగ్రహాలపై భారత్ సరికొత్త ‘స్నూపింగ్’!

అహ్మదాబాద్‌కు చెందిన ‘అజిస్తా’ సంస్థ కక్ష్యలో ఉన్న ఇతర ఉపగ్రహాలను ఫొటోలు తీసే (In-orbit imaging) సామర్థ్యాన్ని నిరూపించింది. ఇండియన్ టెక్నాలజీతో తయారైన AFR శాటిలైట్.. వేగంగా కదులుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని స్పష్టంగా ఫొటోల్లో బంధించింది. శత్రువుల కదలికలను పసిగట్టడానికి, అంతరిక్ష ఆస్తులను రక్షించుకోవడానికి, క్షిపణులను ట్రాక్ చేయడానికి ఈ ‘స్పేస్ స్నూపింగ్’ భారత్‌కు కీలకం కానుంది.
News February 8, 2026
CIPETలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ(CIPET)11 పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు FEB 9 -మార్చి 3వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ME/MTech, PhD, MBA, PG పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. నెలకు మేనేజర్‌కు రూ.78,800, Sr. టెక్నికల్ ఆఫీసర్‌కు రూ.67,700 చెల్లిస్తారు. సైట్: https://www.cipet.gov.in
News February 8, 2026
జైలుకెళ్లిన ప్రముఖ జ్యోతిషుడు.. బ్యాగ్రౌండ్ చూస్తే

కర్ణాటక జ్యోతిషుడు కమలాకర్ భట్ ఫ్లాష్‌బ్యాక్ సినిమా స్టోరీనే. తమలపాకులు, మరమరాలు అమ్మిన ఆయన.. జ్యోతిషుడైతే లైఫ్ సెట్ అవుతుందనే ఫ్రెండ్ సలహాతో 2005లో కేరళలో ఆ విద్య నేర్చాడు. త్వరగా పాపులరవ్వాలని TVల్లో ఆస్ట్రాలజీ చెప్పాడు. సమస్యలున్న వారిని తీసుకొచ్చే ఏజెంట్లకు కమీషన్ ఇస్తూ ₹వందల కోట్లు పోగేశాడు. ఏజెంట్ సుచిత్రతో అక్రమసంబంధం సాగిస్తూ, అడ్డుగా ఉన్నారని ఆ కుటుంబంపై గతవారం దాడి చేయించి జైలుకెళ్లాడు.


