News September 23, 2025
సంగారెడ్డిలో హోంగార్డుల సమస్యల పరిష్కారానికి కృషి: ఎస్పీ

పోలీస్ శాఖలో పనిచేసే హోంగార్డుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సంగారెడ్డి ఎస్పీ పారితోష్ పంకజ్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో హోంగార్డులకు జాకెట్స్, రెయిన్ కోట్లను సోమవారం పంపిణీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. డ్యూటీల విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉన్న నేరుగా తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రావు, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News September 23, 2025
ఫెన్సింగ్ పోటీలలో సత్తా చాటిన నంద్యాల యువతి

ఇటీవల ఉత్తరాఖండ్‌లో జరిగిన అండర్ 17 ఫెన్సింగ్ పోటీలలో నంద్యాలకు చెందిన చిన్మయి శ్రేయ అద్భుతమైన ప్రదర్శన కనపరచి సత్తా చాటింది. ఈ సందర్భంగా సోమవారం నంద్యాలలో చిన్మయి శ్రేయను పలువురు అభినందించారు. అండర్ 17 ఫెన్సింగ్ క్రీడలో రాయలసీమలోని మొదటిసారిగా సత్తా చాటిన చిన్మయి శ్రేయ మన నంద్యాల వాసి కావడం మనందరికీ గర్వకారణమని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ పేర్కొన్నారు.
News September 23, 2025
విశాఖ రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేసిన ఈస్ట్ కోస్ట్ రైల్వే జీఎం

విశాఖ రైల్వే స్టేషన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జీఎం పరమేశ్వర్ ఫంక్వాల్ సోమవారం తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించి ప్రయాణికులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ప్లాట్ ఫాంపై ఉన్న ఫుడ్ కోర్టులను తనిఖీ చేసి నాణ్యతను పరిశీలించారు. రిజర్వేషన్ కేంద్రాలను, టికెట్ బుకింగ్ కౌంటర్ లను,క్యాప్సిల్ హోటల్‌ను సందర్శించి పలు సూచనలు చేశారు. రానున్న దసరా సెలవు దృష్ట్యా ప్రయాణికులకు సౌకర్యాలు అందించాలని సూచించారు.
News September 23, 2025
ఆర్టీసీ ఉద్యోగులకు దసరా అడ్వాన్స్: సజ్జనార్

TG: ఆర్టీసీ ఉద్యోగులకు దసరా పండుగ అడ్వాన్స్ ఇవ్వాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. ఉద్యోగుల హోదా, నెల జీతం ఆధారంగా అడ్వాన్స్ ఇవ్వనున్నట్లు తెలిపింది. తిరిగి వారి జీతం నుంచి నెలకు కొంత మొత్తంలో వసూలు చేస్తామని పేర్కొంది. ఈ మేరకు అధికారులతో సమావేశంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ నిర్ణయం తీసుకున్నారు. వెంటనే అడ్వాన్స్ చెల్లించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.