News September 23, 2025
మేడారానికి జాతీయ హోదా దక్కేనా..?

తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు జాతీయ పండుగ హోదా దక్కాలనే ప్రజల ఆకాంక్ష నెరవేరట్లేదు. గత దశాబ్ధ కాలంగా కేంద్ర ప్రభుత్వానికి చేస్తున్న వినతులు సత్ఫలితాలు ఇవ్వట్లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మేడారం జాతర విశిష్ఠతను విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. జాతీయ పండుగ హోదా దక్కితే అపరిమిత అభివృద్ధి జరుగుతుందని ఆశించారు. ఈ సరైనా కేంద్రం స్పందించి జాతీయ హోదా ఇస్తుందో చూడాలి.
Similar News
News September 23, 2025
కామారెడ్డి: మేఘమా శాంతించుమా

కామారెడ్డి జిల్లాలో వర్షాభావ పరిస్థితుల నుంచి ఒక్కసారిగా కుండపోత వర్షాలతో రైతులు తీవ్ర ఆందోళనలో పడ్డారు. నెల రోజుల క్రితం ‘మేఘమా వర్షించుమా’ అని ఆకాశం వైపు చూసిన అన్నదాతలు, ఇప్పుడు ‘మేఘమా శాంతించుమా’ అంటూ మొర పెట్టుకుంటున్నారు. పక్షం రోజుల క్రితం కురిసిన కుండపోత వర్షాలకు జిల్లా అతలాకుతలం అయ్యింది. సోమవారం మళ్లీ పలుచోట్ల భారీ వర్షంతో తడిసి ముద్దయింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
News September 23, 2025
మదనపల్లెను జిల్లాగా ప్రకటించాలి: బాస్ అధ్యక్షుడు

ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే మదనపల్లెను జిల్లాగా ప్రకటించాలని భారతీయ అంబేడ్కర్ సేన(బాస్) అధ్యక్షుడు పీటీఎం శివప్రసాద్ డిమాండ్ చేశారు. మదనపల్లె ప్రజలకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. మదనపల్లెలోని బాస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6నెలల్లోనే జిల్లాగా ప్రకటిస్తామని ఎన్నికల్లో కూటమి నాయకులు హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
News September 23, 2025
కర్రల సమరం: ‘బన్నీ ఉత్సవం ప్రశాంతంగా జరగాలి’

దేవరగట్టు బన్నీ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అధికారులను ఆదేశించారు. అక్టోబరు 2న బన్నీ ఉత్సవాలు జరగనుండగా కలెక్టర్ డాక్టర్ సిరి, ఎస్పీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘నెరణికి, నెరణికి తండా, కొత్తపేట, దేవరగట్టు గ్రామాల ప్రజలు బన్నీ ఉత్సవాన్ని సమస్యలు రాకుండా పండుగలా జరుపుకోవాలి. ఉత్సవ పర్యవేక్షణకు 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి’ అని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.