News September 23, 2025

వరంగల్: అమ్మాయిలూ.. మౌనంగా ఉండకండి!

image

ఎవరైనా ఆకతాయిలు మహిళలు, విద్యార్థినులను వేధిస్తే తక్షణమే షీ టీం పోలీసులకు సమాచారం ఇవ్వాలని షీ టీం ఎస్సై యాదగిరి తెలిపారు. వరంగల్ షీ టీం ఆధ్వర్యంలో వరంగల్ వస్త్ర దుకాణంలో షీ టీంతో పాటు డయల్ 100, మహిళల అక్రమ రవాణా, బాల్య వివాహాలు, సైబర్ క్రైం, టీసేఫ్ యాప్‌పై షాపు సిబ్బందికి అవగాహన కల్పించారు. ఎవరైనా వేధిస్తే మౌనంగా ఉండకుండా షీ టీంకు తెలపాలని ఎస్సై సూచించారు.

Similar News

News September 23, 2025

ఆ కేసు మరో పరకామణి కేసుగా మారుతుందా..?

image

భక్తులు పోగొట్టుకున్న వస్తువులు, నగదు, ఆభరణాలు, వాచీలు, ఫోన్లను 2023లో కమాండ్ కంట్రోల్ సిబ్బంది, వీఐ వాటాలు వేసుకొని స్వాహ చేసినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. భక్తుల వస్తువుల రికార్డు లేకుండా పంపిణీ చేయడం గమనార్హం. CCటీవీ ఫుటేజీలు సైతం మాయం చేసినట్లు సమాచారం. ఈ ఘటనను పరకామణి-2 కేసుగా పరిగణనలోకి తీసుకుంటున్న TTD మరిన్ని ఆధారాలు పాలకమండలి ద్వారా బహిర్గతం చేసే అవకాశం ఉంది.

News September 23, 2025

నేడు గాయత్రీ దేవి అలంకారంలో ఇంద్రకీలాద్రి దుర్గమ్మ

image

ఇంద్రకీలాద్రి దుర్గమ్మ మంగళవారం గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనుందని ఆలయ పండితులు తెలిపారు. స్వర్ణ పంచముఖాలు, బంగారు అభయహస్తాలు, పచ్చల హారం, కంఠాభరణం, శంఖు చక్రాలు, బంగారు కిరీటంతో వేదమాత దర్శనమిస్తుందని చెప్పారు. దసరా నవరాత్రుల రెండో రోజు ఈ అలంకారం చేస్తారు. అమ్మవారిని శంఖం, చక్రం, గద, అంకుశం వంటి ఆయుధాలతో, మంత్రాలతో అలంకరిస్తారు.

News September 23, 2025

4న ఒంగోలుకు పవన్ కళ్యాణ్ రాక?

image

ప్రకాశం జిల్లాకు త్వరలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. ఒంగోలులో బాలినేని ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. అక్టోబర్ 4వ తేదీన ఈ కార్యక్రమ ప్రారంభానికి పవన్ వస్తారని సమాచారం. అమరావతిలో బాలినేని శ్రీనివాసరెడ్డి నిన్న డిప్యూటీ సీఎంను కలిసి ఈ మేరకు చర్చించారు.