News September 23, 2025

సెప్టెంబర్ 23: చరిత్రలో ఈరోజు

image

1976: దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ జననం
1985: క్రికెటర్ అంబటి రాయుడు జననం
1993: నటి షాలిని పాండే జననం
1996: నటి సిల్క్ స్మిత మరణం(ఫొటో)
2019: నటుడు కోసూరి వేణుగోపాల్ మరణం
✤అంతర్జాతీయ సంజ్ఞా భాషల దినోత్సవం

Similar News

News September 23, 2025

సూర్యలంక బీచ్ ఫెస్టివల్ వాయిదా

image

AP: బాపట్లలోని సూర్యలంక తీరంలో ఈ నెల 26, 27, 28వ తేదీలలో నిర్వహించాల్సిన బీచ్ ఫెస్టివల్ వాయిదా పడింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పర్యాటక శాఖ తెలిపింది. నిన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించిన ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి అధికారులకు ఇదే విషయాన్ని తెలియజేశారు. త్వరలోనే కొత్త తేదీలను నిర్ణయించనున్నట్లు వెల్లడించారు.

News September 23, 2025

కోళ్ల దాణా నిల్వలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

కోళ్లకు మంచి దాణా అందించినప్పుడే వాటి పెరుగుదల బాగుంటుంది. అయితే దాణా నిల్వలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వెటర్నరీ అధికారులు సూచిస్తున్నారు. దాణా బస్తాలను నేలపై కాకుండా చెక్క పలకల మీద ఉంచాలి. గోడలకు తగలకుండా చూడాలి. తేమగా ఉన్న దాణాను నిల్వ చేయకూడదు. 2-3వారాలకు మించి దాణా నిల్వ ఉంచకూడదు. వేడిగా ఉన్న దాణాను చల్లబడిన తర్వాత మాత్రమే గోదాముల్లో నిల్వ ఉంచాలి. లేదంటే బస్తాలపై తేమ ఏర్పడి బూజు పడుతుంది.

News September 23, 2025

విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో జాబ్‌లు

image

విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్(<>VSSC<<>>) 17 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు అక్టోబర్ 6వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ME/MTech ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 30ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.750. అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.vssc.gov.in/