News September 23, 2025
హన్మకొండ: పచ్చదనం విరిసి.. అవని మురిసి..!

అందమైన ప్రకృతి అంటే ఎవరు ఇష్టపడరు చెప్పండి. చుట్టూ పంట పొలాలు, వాటి మధ్యలో గుట్టలు, ఎత్తైన తాటి చెట్లు, పంట పొలాల్లో పని చేస్తున్న రైతన్నలు, గొర్రెలను మేపుతున్న కాపరులు. ఇవన్నీ ఒకే చోట ఉంటే చూడటానికి రెండు కళ్లు సరిపోవనే చెప్పవచ్చు. అలాంటి దృశ్యం మన హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ఎర్రబెల్లి గ్రామ శివారులోని ఇనుపరాతి గుట్టల వద్ద కనివిందు చేస్తోంది. అచ్చం ఓ చిత్రకారుడు గీసిన చిత్రలాగే ఉంది.
Similar News
News September 23, 2025
HYD: రోప్‌వే కోసం HMDA అడుగులు!

హైదరాబాద్.. చారిత్రక కట్టడాలకు పెట్టింది పేరు. గొప్ప వారసత్వ సంపద కలిగిన నగరాన్ని లక్షలాది మంది సందర్శిస్తుంటారు. సిటీకి వచ్చే టూరిస్టులకు సరికొత్త అనుభూతిని కలిగించేందుకు HMDA రోప్‌వేకు ప్లాన్ చేస్తోంది. గోల్కొండ నుంచి 7 టూంబ్స్ వరకు రోప్‌వే నిర్మించాలని నిర్ణయించింది. సాధ్యాసాధ్యాలపై నివేదిక తయారు చేయడం కోసం నైట్ ఫ్రాంక్ అనే సంస్థను ఎంపిక చేసింది. 3 నెలలో HMDAకు ఈ సంస్థ నివేదిక అందజేయాల్సి ఉంది.

భీమవరం: ఇ-డివిజనల్ మేనేజర్ పోస్ట్ భర్తీకి దరఖాస్తులు

భీమవరం డివిజన్‌కు సంబంధించిన ఇ-డివిజనల్ మేనేజర్ పోస్ట్ భర్తీకి పొరుగు సేవల పద్ధతిలో దరఖాస్తులు చేసుకోవచ్చునని కలెక్టర్ నాగరాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తును అందుబాటులో ఉంచామన్నారు. వాటిని పూరించిన దరఖాస్తులను విద్యార్హత ధృవీకరించబడిన కాపీలతో భీమవరంలోని జిల్లా రెవెన్యూ అధికారి సిసికి అందజేయాలన్నారు. అక్టోబర్ 3లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.