News September 23, 2025
MDK: గూగుల్ మ్యాప్ నమ్ముకొని ఇరుక్కుపోయాడు

మెదక్ జిల్లాలో గూగుల్ మ్యాప్ ఆధారంగా ప్రయాణించిన డీసీఎం డ్రైవర్ ఇబ్బందుల్లో పడ్డాడు. ఆదివారం వైజాగ్ నుంచి వడియారం మహావీర్ పేపర్ పరిశ్రమకు వచ్చిన డీసీఎం.. గూగుల్ మ్యాప్ ఆధారంగా వెళ్లగా కుంట కట్టవైపు చూపించింది. ముందుకు వెళ్లగా రైల్వే ట్రాక్ అడ్డు రావడంతో వెనుకకు రివర్స్‌లో వస్తుండగా కట్టపై గుంతలో డీసీఎం ఊరుకుపోయింది. క్రేన్ సహాయంతో డీసీఎంను బయటకు తీశారు.
Similar News
News September 23, 2025
చిత్తూరు TDP అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ..?

జిల్లా TDP అధ్యక్ష పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది. B.చిట్టిబాబు, జయప్రకాష్ నాయుడు, P.విజయ్‌బాబు, హేమంబరధరావు, మహదేవ సందీప్ వంటి నేతలు బరిలో ఉన్నారు. మహిళా కోటాలో K.అరుణ ఉన్నారు. ఇక చిత్తూరు MLA నాయుడు సామాజిక వర్గ నేత కావడంతో బలిజ కోటాలో బాలాజీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. త్వరలోనే అధ్యక్షులను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
News September 23, 2025
లక్కవరంలో ఇంటిలో చోరీ

జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో ఓ ఇంటిలో దొంగలు చొరబడి చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న రుక్కయ్య, లక్ష్మీకుమారిలపై దొంగలు దాడికి పాల్పడి నగదు, ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితులు ఫిర్యాదు చేయగా, డీఎస్పీ రవిచంద్ర ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
News September 23, 2025
అనకాపల్లి జిల్లాలో 94 సైబర్ కేసులు: ఎస్పీ

ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ తుహీన్ సిన్హా సోమవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. జిల్లాలో ఈ ఏడాది జూలై 1 నుంచి ఇప్పటివరకు 94 సైబర్ కేసులు నమోదయ్యాయన్నారు. ఈ కేసుల్లో ఇప్పటివరకు రూ.93.78 లక్షలను ఫ్రీజ్ చేశామన్నారు. అలాగే రూ.15.45 లక్షల మొత్తాన్ని బాధితులకు తిరిగి చెల్లించినట్లు తెలిపారు. సైబర్ మోసాలకు గురైతే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు.