News April 5, 2024

లక్కీ డిప్‌లో వీఐపీ బ్రేక్ దర్శనం: TTD ఈవో

image

AP: సిఫార్సు లేఖలపై వీఐపీ దర్శనాన్ని రద్దు చేసినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. దీనివల్ల జూన్ 4 వరకు సామాన్య భక్తులకు రోజూ రెండు గంటల దర్శన సమయం పెరుగుతుందన్నారు. ఇకపై వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను కూడా లక్కీ డిప్‌లోని ఇస్తామని చెప్పారు. శ్రీవారి సేవకులకు తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.

Similar News

News February 5, 2025

ఖమ్మంలో రూ.116 కోట్ల ధాన్యం కొనుగోళ్లు: కొత్వాల

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో DCMS ద్వారా 2024-25 వానాకాలంలో 4.13 లక్షల క్వింటాళ్ల వరి ధాన్యానికి రూ.116.49 కోట్లు చెల్లించామని రాష్ట్ర మార్క్‌ఫెడ్ డైరెక్టర్, DCMS ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. ధాన్యం కొనుగోలు వివరాలను ఆయన వెల్లడించారు. భద్రాద్రి జిల్లాలో 94 వేల క్వింటాళ్లకు గాను రూ.26.78 కోట్లు, ఖమ్మం జిల్లాలో 3.19 లక్షల క్వింటాళ్లకు గాను సుమారు రూ.90 కోట్లను చెల్లించినట్లు వెల్లడించారు.

News February 5, 2025

ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక నేత కన్నుమూత

image

ప్రపంచ ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక నేత ఆగా ఖాన్(88) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆగా ఖాన్ డెవలప్‌మెంట్ నెట్ వర్క్ Xలో వెల్లడించింది. ఆయన వారసుడిని త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. ఆగా ఖాన్‌కు ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. 1957లో ఆయన ఇమామ్‌గా బాధ్యతలు స్వీకరించారు.

News February 5, 2025

పట్టణాలు చిన్నవే కానీ లగ్జరీ షాపింగ్‌లో టాప్!

image

భారత్‌లో చిన్న పట్టణాల ప్రజలు లగ్జరీ షాపింగ్‌పై భారీగా వెచ్చిస్తున్నారని టాటా క్లిక్ లగ్జరీ నివేదిక తెలిపింది. ఈ-కామర్స్ విస్తృతి పెరగడంతో మారుమూల పట్టణాల ప్రజలు సైతం ఆన్‌లైన్‌లో ఖరీదైన బ్రాండ్ల ఉత్పత్తుల్ని కొనుగోలు చేస్తున్నారని పేర్కొంది. ‘వాచీలు, చెప్పులు, దుస్తులు, యాక్సెసరీస్‌ను ఖర్చుకు వెనుకాడకుండా కొంటున్నారు. ఉత్పత్తిపై పూర్తిగా రిసెర్చ్ చేశాకే కొనుగోలు చేస్తున్నారు’ అని వెల్లడించింది.

error: Content is protected !!