News September 23, 2025
4న ఒంగోలుకు పవన్ కళ్యాణ్ రాక?

ప్రకాశం జిల్లాకు త్వరలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. ఒంగోలులో బాలినేని ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. అక్టోబర్ 4వ తేదీన ఈ కార్యక్రమ ప్రారంభానికి పవన్ వస్తారని సమాచారం. అమరావతిలో బాలినేని శ్రీనివాసరెడ్డి నిన్న డిప్యూటీ సీఎంను కలిసి ఈ మేరకు చర్చించారు.
Similar News
News September 23, 2025
గిద్దలూరులో పుట్టిన బిడ్డను వదిలేసిన తల్లి

గిద్దలూరులో అమానుష ఘటన వెలుగు చూసింది. ఓ ప్రైవేటు వైద్యశాలకు సోమవారం అర్ధరాత్రి ప్రసవ వేదనతో ఓ గర్భిణీ వచ్చింది. డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో టాయిలెట్ వద్ద మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆ బిడ్డను అక్కడే వదిలి వెళ్లిపోయింది. వైద్య సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ మహిళ ఎవరు? ఎందుకు అలా చేసింది? అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు.
News September 23, 2025
ప్రకాశం: భార్య చికెన్ వండలేదని ఉరేసుకున్నాడు..!

ఈ ఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలో వెలుగు చూసింది. పోలీసుల వివరాల మేరకు.. గోళ్లవిడిపి గ్రామంలో ఇళ్ల లక్ష్మీనారాయణ(25) భార్యతో కలిసి ఉంటున్నాడు. ఇటీవల భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం చికెన్ వండాలని లక్ష్మీనారాయణ చెప్పినప్పటికీ ఆమె పట్టించుకోలేదు. మనస్తాపానికి గురైన అతను పొలాల్లోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
News September 23, 2025
వర్షం ఎఫెక్ట్.. బాపట్ల బీచ్ ఫెస్టివల్ వాయిదా.!

బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌లో ఈనెల 26-28 తేదీల్లో జరగాల్సిన బీచ్ ఫెస్టివల్‌ను ప్రభుత్వం వాయిదా వేసింది. AP ప్రకృతి విపత్తు నిర్వహణ సంస్థ 26, 27 తేదీల్లో బాపట్ల జిల్లాకు భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఫెస్టివల్ వాయిదా వేసినట్లు ప్రకటించారు. జిల్లా అధికారులు ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మళ్లీ నిర్వహించే తేదీని ఖరారు చేయాల్సిఉంది.