News September 23, 2025
ఆ కేసు మరో పరకామణి కేసుగా మారుతుందా..?

భక్తులు పోగొట్టుకున్న వస్తువులు, నగదు, ఆభరణాలు, వాచీలు, ఫోన్లను 2023లో కమాండ్ కంట్రోల్ సిబ్బంది, వీఐ వాటాలు వేసుకొని స్వాహ చేసినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. భక్తుల వస్తువుల రికార్డు లేకుండా పంపిణీ చేయడం గమనార్హం. CCటీవీ ఫుటేజీలు సైతం మాయం చేసినట్లు సమాచారం. ఈ ఘటనను పరకామణి-2 కేసుగా పరిగణనలోకి తీసుకుంటున్న TTD మరిన్ని ఆధారాలు పాలకమండలి ద్వారా బహిర్గతం చేసే అవకాశం ఉంది.
Similar News
News September 23, 2025
మీరే బకాయిలు పెట్టి మమ్మల్ని అంటారా: లోకేశ్

AP: శాసన మండలిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చ సందర్భంగా YCP నేత బొత్సపై మంత్రి లోకేశ్ మండిపడ్డారు. ‘మీరే బకాయిలు పెట్టి మమ్మల్ని అంటారా? సీనియర్ నేత అయ్యుండి బీఏసీలో ఎందుకు మాట్లాడలేదు? నన్ను డిక్టేట్ చేయడం సరికాదు’ అని ఆగ్రహించారు. తమ హయాంలో బకాయిలు పెట్టలేదని, లోకేశ్ మాటలు సరిగాలేవని బొత్స బదులిచ్చారు. కాగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై YCP ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ఛైర్మన్ తిరస్కరించారు.
News September 23, 2025
గిద్దలూరులో పుట్టిన బిడ్డను వదిలేసిన తల్లి

గిద్దలూరులో అమానుష ఘటన వెలుగు చూసింది. ఓ ప్రైవేటు వైద్యశాలకు సోమవారం అర్ధరాత్రి ప్రసవ వేదనతో ఓ గర్భిణీ వచ్చింది. డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో టాయిలెట్ వద్ద మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆ బిడ్డను అక్కడే వదిలి వెళ్లిపోయింది. వైద్య సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ మహిళ ఎవరు? ఎందుకు అలా చేసింది? అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు.
News September 23, 2025
NLG: స్థానికంలో రొటేషన్.. మారనున్న స్థానాలు!

జిల్లాలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించనుండటంతో ఇప్పటివరకు ఉన్న రిజర్వేషన్లు అన్నీ మారిపోనున్నాయి. BRS ప్రభుత్వ హయాంలో 2 సార్లు నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పటి వరకు ఉన్న రిజర్వేషన్లనే అమలు చేశారు. ప్రస్తుతం వాటిని తొలగించి రిజర్వేషన్ల రొటేషన్ పద్ధతిని అమలు చేయనున్నారు. ఈసారి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో అధిక సంఖ్యలో సీట్లు లభించనున్నాయి.