News September 23, 2025
నిజాంసాగర్ ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తివేత

నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పెరిగుతోంది. మంగళవారం ఉదయం 6 గంటలకు ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి 77,446 క్యూసెక్కుల నీటిని మంజీరాకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఏఈఈ అక్షయ్ తెలిపారు. ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 70,787 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్నట్లు చెప్పారు. దీంతో ప్రస్తుతం ప్రాజెక్టులో 15.778 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కాగా మరో వెయ్యి క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువకు విడుదల కొనసాగుతోంది.
Similar News
News September 23, 2025
స్వామి వారిని దర్శించుకున్న విదేశీయుల బృందం

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని వివిధ దేశాలకు చెందిన 30 మంది ప్రతినిధులు దర్శించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న ‘ట్రైనింగ్ ఆఫ్ మీడియా మేనేజ్‌మెంట్’ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన శ్రీలంక, వియత్నాం, థాయ్‌లాండ్, ఈజిప్ట్ తదితర 25 దేశాలకు చెందిన ఈ బృందం స్వామివారిని దర్శించుకుంది. దర్శనం అనంతరం వీరికి ఆలయ అధికారులు వేద ఆశీర్వచనం అందజేశారు.
News September 23, 2025
యాదాద్రీశుడి హుండీలో విదేశీ కరెన్సీలు

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి హుండీ ఆదాయాన్ని సోమవారం లెక్కించగా, పది విదేశాల కరెన్సీలు వచ్చినట్లు ఈఓ వెంకట్రావు తెలిపారు. అమెరికా నుంచి $540, ఇంగ్లాండ్ £95, నేపాల్ రూ.10, సౌదీ అరేబియా 6 రియాళ్లు, ఒమాన్ 401 రియాళ్లు, మలేసియా 40 రింగిట్లు, యూరో €5, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 155 దిర్హామ్‌లు, కెనడా $70, ఇరాక్ నుంచి 250 దినార్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
News September 23, 2025
లింగాల: సెల్‌ఫోన్ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య

నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రంలో ఓ యువకుడు సెల్‌ఫోన్ కోసం ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చరణ్ (18) అనే యువకుడు సోమవారం రాత్రి కొత్త సెల్‌ఫోన్ కొనివ్వమని తన తల్లిని కోరాడు. ఆర్థిక సమస్యల వల్ల తల్లి జీతం వచ్చాక కొనిస్తానని చెప్పడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.