News September 23, 2025

నేడు మయూర వాహనంపై దర్శనం

image

శ్రీశైలం క్షేత్రంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.. మంగళవారం జరిగే కార్యక్రమాల వివరాలు ఇలా..
★ ఉదయం బ్రహచారిణి అలంకారంలో దర్శనం, మధ్యాహ్నం స్వామి, అమ్మవారికి అభిషేకం, సాయంత్రం వేళ సాధారణ పూజలు, రాత్రి మయూర వాహనంపై మల్లికార్జున స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమాలు ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.

Similar News

News September 23, 2025

జూబ్లీహిల్స్‌ క్లాస్ అనుకుంటున్నారా.. ఊర మాస్!

image

జూబ్లీహిల్స్‌ను అంతా కాస్ట్‌లీ నియోజకవర్గమని పిలుస్తారు. విశాలమైన భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లతో గ్రాండ్‌గా కనిపిస్తది. కానీ, జూబ్లీహిల్స్‌ MLAను ఎన్నుకునేది మాత్రం పేదలే అని ఎందరికి తెలుసు. అవును, నియోజవకర్గంలోని మెజార్టీ డివిజన్లు పక్కా మాస్. షేక్‌పేట, ఎర్రగడ్డ, బోరబండ, రహమత్‌నగర్‌, యూసుఫ్‌గూడ‌, సోమాజిగూడ‌లోని మధ్య తరగతి, పేదలే ఓట్లేస్తారు. ఇక్కడ అందమైన భవంతులే కాదు అంతకుమించి బస్తీలున్నాయి.

News September 23, 2025

రబీ నుంచి ఆధార్‌పై ఎరువులు: అచ్చెన్నాయుడు

image

AP: వచ్చే రబీ సీజన్‌కు యూరియా సరఫరాలో ఎలాంటి కొరత ఉండదని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రబీ నుంచి ఆధార్ కార్డు ఆధారంగా ఎరువులు సరఫరా చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. ఖరీఫ్ కోసం రాష్ట్ర అవసరాల మేరకు కేంద్రం నుంచి యూరియా తెప్పించామని, కొన్ని చోట్ల సరఫరాలో లోపాలు తలెత్తాయని, వాటిని సరిచేసుకొని ముందుకెళ్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది 1.23 లక్షల హెక్టార్ల సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు.

News September 23, 2025

మైసూరులో ప్రారంభమైన దసరా ఉత్సవాలు

image

ప్రపంచ ప్రసిద్ధి చెందిన మైసూరు దసరా(నాడా హబ్బ) ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ గ్రహీత, రచయిత్రి భాను ముష్తాక్, కర్ణాటక CM సిద్దరామయ్యతో కలిసి ఉత్సవాలు ప్రారంభించారు. చాముండేశ్వరి ఆలయంలో పుష్పవృష్టితో మొదలైన ఈ 11 రోజుల పండుగలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఊరేగింపులు ఉంటాయి. అక్టోబర్ 2న జంబో సవారితో ముగిసే ఈ వేడుకలు కర్ణాటక రాజవంశ వారసత్వాన్ని, ప్రగతిని ప్రదర్శిస్తాయి.