News September 23, 2025

PDPL: ఒక్కో కార్మికుడికి రూ.1.95లక్షల BONUS!

image

సింగరేణి కార్మికులు 6నెలలుగా ఎదురుచూస్తున్న లాభాల వాటాను రూ.819 కోట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఒక్కో పర్మినెంట్ ఎంప్లాయ్‌ ఖాతాలో రూ.1.95లక్షల వరకు బోనస్ జమ కానుంది. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ కార్మికులూ నిరాశ చెందకుండా వారికీ ప్రభుత్వం రూ.17కోట్లను కేటాయించగా.. ఒక్కో కార్మికుడు రూ.5,500ల చొప్పున లబ్ధి పొందనున్నాడు. కాగా, దసరా, దీపావళి వేళ లాభాల ప్రకటనతో కార్మికుల కుటుంబాల్లో సంతోషం నెలకొంది.

Similar News

News September 23, 2025

ఐటీఐ అర్హతతో SJVNలో 87పోస్టులు

image

<>SJVN<<>> లిమిటెడ్ 87 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు అక్టోబర్ 13వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిలో అసిస్టెంట్(అకౌంట్స్), డ్రైవర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, టర్నర్, వెల్డర్, స్టోర్ కీపర్, సర్వేయర్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి ఐటీఐ, బీకామ్, డిగ్రీ, 8వ తరగతి (డ్రైవర్ పోస్టులకు)ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 30ఏళ్లు. వెబ్‌సైట్: https://sjvn.nic.in/

News September 23, 2025

మైథాలజీ క్విజ్ – 14

image

1. రామాయణంలో ‘వాలి’ కుమారుడు ఎవరు?
2. వ్యాసుని ద్వారా దాసి కన్న బిడ్డ ఎవరు?
3. అత్రి మహాముని భార్య ఎవరు?
4. కామాఖ్య దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది?
5. శ్రీరామనవమి ఏ తెలుగు మాసంలో వస్తుంది?
– సమాధానాలు సాయంత్రం 6 గంటలకు
<<-se>>#mythologyquiz<<>>

News September 23, 2025

మండలి నుంచి వైసీపీ వాకౌట్

image

ఏపీ శాసన మండలి నుంచి వైసీపీ వాకౌట్ చేసింది. అట్రాసిటీ కేసులపై చర్చ సందర్భంగా ‘మాపై గొడ్డలి వేటు, కోడికత్తి, అమ్మా, చెల్లి కేసులు లేవు’ అని హోం మంత్రి అనిత YCPపై సెటైర్లు వేశారు. దీంతో ఆమె వ్యాఖ్యలకు నిరసనగా వాకౌట్ చేస్తున్నామంటూ YCP ఎమ్మెల్సీలు బయటికి వెళ్లిపోయారు.