News September 23, 2025

నల్గొండ సీపీఓగా ఆర్డీవో అశోక్ రెడ్డి అదనపు బాధ్యతలు

image

నల్గొండ ఆర్డీవో అశోక్ రెడ్డి సోమవారం నల్గొండ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్‌గా (సీపీఓ) అదనపు బాధ్యతలు స్వీకరించారు. గతంలో సీపీఓగా బాధ్యతలు నిర్వహించిన సూర్యాపేట అసిస్టెంట్ డైరెక్టర్ ఎల్. కిషన్ అందుబాటులో ఉండకపోవడంతో జిల్లా కలెక్టర్ ఆయన్ను తొలగించారు. దీంతో ప్రస్తుత సీపీఓగా ఆర్డీవో అశోక్ రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News September 23, 2025

NLG: స్థానికంలో రొటేషన్.. మారనున్న స్థానాలు!

image

జిల్లాలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించనుండటంతో ఇప్పటివరకు ఉన్న రిజర్వేషన్లు అన్నీ మారిపోనున్నాయి. BRS ప్రభుత్వ హయాంలో 2 సార్లు నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పటి వరకు ఉన్న రిజర్వేషన్లనే అమలు చేశారు. ప్రస్తుతం వాటిని తొలగించి రిజర్వేషన్ల రొటేషన్ పద్ధతిని అమలు చేయనున్నారు. ఈసారి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో అధిక సంఖ్యలో సీట్లు లభించనున్నాయి.

News September 23, 2025

నల్గొండ: ప్రజావాణికి 72 దరఖాస్తులు

image

నల్గొండ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 72 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో రెవెన్యూ శాఖకు 46, మిగిలినవి ఇతర శాఖలకు సంబంధించినవిగా అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. వ్యక్తిగత అంశాలు, భూ వివాదాలు, గృహ నిర్మాణాలకు సంబంధించిన సమస్యలపై ఎక్కువ ఫిర్యాదులు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్‌కుమార్‌, DRDO శేఖర్‌ రెడ్డి పాల్గొన్నారు.

News September 23, 2025

NLG: బతుకమ్మ వేడుకలపై పోలీసుల నిఘా

image

బతుకమ్మ సంబరాల్లో మహిళలు, యువతులపై వేధింపులు, ఈవ్‌ టీజింగ్‌ను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ తెలిపారు. ఈ చర్యలకు పాల్పడిన ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. జిల్లాలో దుర్గా నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ ఆడే ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశామని ఎస్పీ పేర్కొన్నారు.