News September 23, 2025

VJA: దుర్గమ్మ ప్రసాదం .. నేతి లడ్డూ తయారీ ఇలా.!

image

విజయవాడ దుర్గమ్మ నేతి లడ్డూ అంటే భక్తులకు అత్యంత ఇష్టం. ఈ ఏడాది ఏకంగా రికార్డు స్థాయిలో 36 లక్షల లడ్డూలు సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది కొత్తగా ఆలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న ప్రసాదాల పోటు భవనంలో లడ్డూ తయారీని ఆరంభించారు. ఈసారి విశాలమైన నూతన భవనం ఆరంభించారు. ఎంతో శుభ్రత పాటిస్తూ.. స్వచ్ఛమైన.. రుచికరమైన ప్రసాదం తయారు చేస్తున్నారు.

Similar News

News September 23, 2025

నిజామాబాద్‌లో భారీ చోరీ

image

నిజామాబాద్ నగరంలో భారీ చోరీ జరిగింది. సుమారు 30 తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లు బాధితులు తెలిపారు. నాగారంలోని బ్రాహ్మణ కాలనీలో నివాసం ఉండే పవన్ శర్మ సోమవారం రాత్రి ఇంటికి తాళం వేసి పూజకు వెళ్లారు. గుర్తు తెలియని దుండగులు వచ్చి తాళం పగల గొట్టి ఇంట్లోకి చొరబడి లాకర్‌ను ధ్వసం చేసి అందులోని 30 తులాల బంగారు ఆభరణాలు అపహరించారు. 5వ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News September 23, 2025

వైకుంఠం జ్యోతి ఎవరు?

image

ఆలూరు టీడీపీ ఇన్‌ఛార్జిగా వైకుంఠం జ్యోతి నియమితులయ్యారు. <<17795004>>వైకుంఠం<<>> ఫ్యామిలీ ఆవిర్భావం నుంచి టీడీపీలో కొనసాగుతోంది. జ్యోతి మామ శ్రీరాములు 1995లో KDCC బ్యాంకు ఛైర్మన్‌గా పనిచేశారు. 2006లో ఆయన హత్యకు గురయ్యారు. తర్వాత తనయుడు, జ్యోతి భర్త ప్రసాద్‌ 2011లో ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. పలుమార్లు MLA టికెట్‌ ఆశించినా అవకాశం రాలేదు. పార్టీలోనే కొనసాగుతున్న ఆ ఫ్యామిలీకి మరోసారి ఇన్‌ఛార్జి పదవి దక్కింది.

News September 23, 2025

కడియం: అమ్మవారికి 95 కిలోల లడ్డూ

image

కడియం శ్రీదేవి చౌక్ సెంటర్‌లో జరుగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా, అదే గ్రామానికి చెందిన ఎన్.నానాజీ అమ్మవారికి లడ్డూ సమర్పించారు. 95 కిలోల భారీ లడ్డూను మంగళవారం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సమర్పించారు. ఈ లడ్డూను 10 రోజులపాటు అమ్మవారి వద్ద ఉంచుతామని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు.