News September 23, 2025

గాయత్రీ దేవిగా కనకదుర్గమ్మ.. ఈ మంత్రం పఠించండి

image

శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా రెండో రోజు విజయవాడ కనకదుర్గ అమ్మవారు శ్రీ గాయత్రీ దేవిగా దర్శనమిస్తున్నారు. ఇవాళ గాయత్రీ మంత్రాన్ని పఠించాలి. ‘ముక్తా విద్రుమ హేమ నీల ధవళచ్ఛాయై ర్ముఖై స్త్రీక్షణైః.. యుక్తా మిందునిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికామ్| గాయత్రీం వరదాభయాంకుశకశాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్ర మదారవింద యుగళం హస్తైర్వహంతీభజే॥’ గాయత్రీ అమ్మవారిని దర్శిస్తే ఆరోగ్యం లభిస్తుంది.

Similar News

News September 23, 2025

ప్రజల సొమ్ముతో మీ నేతల విగ్రహాలా: సుప్రీం

image

TN ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు మండిపడింది. వల్లియూర్ డైలీ వెజిటబుల్ మార్కెట్ పబ్లిక్ ఆర్చ్ వద్ద కరుణానిధి కాంస్య విగ్రహం ఏర్పాటు కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. ‘మీ నేతల విగ్రహాల కోసం ప్రభుత్వ నిధులు వినియోగిస్తారా? ఇది ఆమోదయోగ్యం కాదు. అనుమతి కోసం కింది కోర్టుకే వెళ్లండి’ అని స్పష్టం చేసింది. పబ్లిక్ ప్లేసుల్లో విగ్రహ ఏర్పాటును ఆ రాష్ట్ర హైకోర్టు అంతకుముందు తిరస్కరించింది.

News September 23, 2025

ప్రెగ్నెన్సీ ప్రకటించిన కత్రినా కైఫ్

image

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ త్వరలో తల్లి కాబోతున్నారు. ఈ విషయాన్ని కత్రినాతో పాటు ఆమె భర్త విక్కీ కౌశల్ ప్రకటించారు. ‘మా జీవితాల్లో బెస్ట్ ఛాప్టర్‌ను ఆరంభించబోతున్నాం’ అని పేర్కొంటూ ఇన్‌స్టాలో బేబీ బంప్‌తో ఉన్న ఫొటోను షేర్ చేశారు. స్టార్ కపుల్‌కు ఇండస్ట్రీ, ఫ్యాన్స్ నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా 2021లో వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

News September 23, 2025

555 టీఎంసీల కృష్ణా జలాలు కేటాయించాలి: ఉత్తమ్

image

TG: కృష్ణా జలాల వివాదంపై ఢిల్లీలోని ట్రైబ్యునల్‌ ముందు వాదనలు వినిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలో అత్యధిక భూభాగంలో నది ప్రవహిస్తున్నందున 811 టీఎంసీల్లో 555 టీఎంసీలు కేటాయించాలని మంత్రి ఉత్తమ్ డిమాండ్ చేశారు. రాష్ట్రానికి చెందాల్సిన నీటి వాటాలో ఒక్క చుక్క కూడా వదులుకోబోమని తేల్చి చెప్పారు. ఈ సమావేశానికి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన ప్రతినిధులు కూడా హాజరుకానున్నారు.