News September 23, 2025
వేణుగోపాల్‌పై మావోయిస్టు పార్టీ చర్యలు

<<15966343>>‘అభయ్’<<>> పేరుతో కేంద్రంతో శాంతి చర్చలకు పిలుపునిచ్చిన మల్లోజుల వేణుగోపాల్‌ను మావోయిస్టు కేంద్ర కమిటీ ‘ద్రోహి’గా పేర్కొంది. తన వద్ద ఉన్న ఆయుధాలను వెంటనే పార్టీకి అప్పగించాలని ఆదేశించింది. లేదంటే పీపుల్స్ గెరిల్లా ఆర్మీ వాటిని స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించింది. మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ తమ్ముడే వేణుగోపాల్. కిషన్‌జీ భార్య సుజాతక్క ఇటీవల పోలీసులకు <<17695477>>లొంగిపోయిన<<>> విషయం తెలిసిందే.
Similar News
News September 23, 2025
పాలస్తీనా దేశం అనేది ఉండదు: నెతన్యాహు

పాలస్తీనాను దేశంగా గుర్తిస్తూ UK, కెనడా, AUS తదితర దేశాలు ప్రకటించడంపై ఇజ్రాయెల్ PM నెతన్యాహు ఫైరయ్యారు. ‘పాలస్తీనా దేశం అనేది ఉండదు. మా భూభాగంలో టెర్రర్ స్టేట్ ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నాన్ని ఎదుర్కొంటాం. OCT 7న మారణకాండ సృష్టించిన టెర్రరిస్టులకు మీరు భారీ బహుమతి ఇస్తున్నారు. విదేశాలతో పాటు స్వదేశంలో వ్యతిరేకత ఎదురైనా టెర్రర్ స్టేట్ ఏర్పాటును ఆపాను. ఇక ముందు కూడా అది జరగదు’ అని స్పష్టంచేశారు.
News September 23, 2025
ప్రజల సొమ్ముతో మీ నేతల విగ్రహాలా: సుప్రీం

TN ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు మండిపడింది. వల్లియూర్ డైలీ వెజిటబుల్ మార్కెట్ పబ్లిక్ ఆర్చ్ వద్ద కరుణానిధి కాంస్య విగ్రహం ఏర్పాటు కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. ‘మీ నేతల విగ్రహాల కోసం ప్రభుత్వ నిధులు వినియోగిస్తారా? ఇది ఆమోదయోగ్యం కాదు. అనుమతి కోసం కింది కోర్టుకే వెళ్లండి’ అని స్పష్టం చేసింది. పబ్లిక్ ప్లేసుల్లో విగ్రహ ఏర్పాటును ఆ రాష్ట్ర హైకోర్టు అంతకుముందు తిరస్కరించింది.
News September 23, 2025
ప్రెగ్నెన్సీ ప్రకటించిన కత్రినా కైఫ్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ త్వరలో తల్లి కాబోతున్నారు. ఈ విషయాన్ని కత్రినాతో పాటు ఆమె భర్త విక్కీ కౌశల్ ప్రకటించారు. ‘మా జీవితాల్లో బెస్ట్ ఛాప్టర్‌ను ఆరంభించబోతున్నాం’ అని పేర్కొంటూ ఇన్‌స్టాలో బేబీ బంప్‌తో ఉన్న ఫొటోను షేర్ చేశారు. స్టార్ కపుల్‌కు ఇండస్ట్రీ, ఫ్యాన్స్ నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా 2021లో వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.