News September 23, 2025

కరీంనగర్‌లో POSH చట్టంపై వర్క్‌షాప్

image

కరీంనగర్‌లో WD&CW ఆధ్వర్యంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టం(POSH Act)పై సోమవారం వర్క్‌షాప్‌ జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ పమేలా సత్పతి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు, కంపెనీలు, కార్యాలయాల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీ(ICC)ల ఏర్పాటు తప్పనిసరని పేర్కొన్నారు. లైంగిక వేధింపులకు గురైన మహిళలు ఈ కమిటీలకు ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు.

Similar News

News September 23, 2025

‘కరీంనగర్‌లో ఆయుర్వేద సేవలు అందిపుచ్చుకోవాలి’

image

కరీంనగర్‌లో ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా నేడు రామ్‌నగర్‌లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆయుర్వేద ఔషధాలు, యోగాసనాలను పరిశీలించి, ఉచిత సేవల వివరాలను రోగులకు తెలియజేయాలని ఆదేశించారు. గర్భిణీలకు యోగాసనాల అవగాహన, ఆస్పత్రి ఆవరణలో స్వచ్ఛత, మొక్కల నాటడం చేయాలన్నారు.

News September 23, 2025

కరీంనగర్: వైద్య సిబ్బందికి హెపటైటిస్ బీ టీకా

image

కరీంనగర్ జిల్లా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌లో హెపటైటిస్ వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించే వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతర కార్మికులకు హెపటైటిస్ బీ వాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆరోగ్య సంరక్షణలో పనిచేసే సిబ్బందికి రోగనిరోధక శక్తిని పెంచే ఉద్దేశంతో ఈ టీకా కార్యక్రమం మొదలుపెట్టినట్లు ఆయన తెలిపారు.

News September 23, 2025

కరీంనగర్: శ్రీ గాయత్రిదేవీ అవతారంలో అమ్మవారు

image

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని చైతన్యపురి మహాశక్తి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. నేడు 2వ రోజు శ్రీ మహాదుర్గ అమ్మవారు గాయత్రిదేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారిని పసుపు కొమ్ములతో అలంకరించారు. అమ్మవారి దేవాలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. అమ్మవారికి ధూపదీప, నైవేద్యాలు సమర్పించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.