News September 23, 2025

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో లేని జూబ్లీహిల్స్!

image

GHMCలో నియోజకవర్గాలు, డివిజన్ల విభజన కొంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎన్నికలు వస్తే తప్పా ఇది ఎవరూ గమనించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమీపిస్తోంది. అంతటా ప్రచారం చేస్తోన్న నాయకులు జూబ్లీహిల్స్ డివిజన్‌‌ను టచ్ చేయడం లేదు. ఎర్రగడ్డ, యూసుఫ్‌గూడ, బోరబండ, షేక్‌పేట, రహమత్‌నగర్, వెంగళరావునగర్, సోమాజిగూడ(PART)‌లో పర్యటిస్తున్నారు. పేరుకే ‘జూబ్లీహిల్స్’ డివిజన్‌ అయినా ఇది ఖైరతాబాద్‌ అసెంబ్లీలో ఉండటం గమనార్హం.

Similar News

News September 23, 2025

మెదక్: కమీషన్లు చెల్లించకపోవడం దుర్మార్గం: హ‌రీశ్‌రావు

image

నెలల తరబడి రేషన్ కమీషన్ చెల్లించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ డీలర్ల జీవితాలతో చెలగాటం ఆడటం దుర్మార్గం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. పేదలకు రేషన్‌ బియ్యం పంపిణీ చేస్తూ, వారి ఆకలి తీర్చుతున్న రేషన్‌డీలర్లకు.. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల తీరుతో పస్తులుండే పరిస్థితి రావడం శోచనీయం అని పేర్కొన్నారు.

News September 23, 2025

ఎస్కార్ట్ విధుల్లో అప్రమత్తంగా ఉండాలి: అనకాపల్లి ఎస్పీ

image

ఎస్కార్ట్ విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ తుహీన్ సిన్హా సూచించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. తూర్పుగోదావరి జిల్లాలో పోలీస్ సిబ్బంది ఎస్కార్ట్ విధులు నిర్వహిస్తుండగా నిందితుడు పరారైన నేపథ్యంలో పలు సూచనలు చేశారు. ముద్దాయిలను సంకెళ్లతో తీసుకువెళ్లాలన్నారు. ముద్దాయిల అవసరం నిమిత్తం వాహనం ఆపినప్పుడు ఇద్దరు ఎస్కార్ట్‌లు అప్రమత్తతో వ్యవహరించాలన్నారు.

News September 23, 2025

పెద్దపల్లి: నిన్న అలా.. నేడు ఇలా..!

image

బతుకమ్మ సందర్భంగా ఎంగిలిపూల బతుకమ్మ రోజు ఉన్న క్రేజ్ మిగతా రోజుల్లో ఉండట్లేదు. తొమ్మిది రోజులు జరుపుకునే ఘనమైన పండుగ బతుకమ్మ. కానీ, నేటి మహిళలు కేవలం మొదటి రోజు, చివరి రోజు మాత్రమే వేడుకలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎంగిలిపూల బతుకమ్మ రోజు దేవాలయాలు, చెరువుల వద్ద మహిళలు కిటకిటలాడగా, రెండో రోజు అసలు బతుకమ్మ ఊసే ఎత్తట్లేదు. కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడం గమనార్హం.