News September 23, 2025
ఏ పంటలకు ఎలాంటి కంచె పంటలతో లాభం?

☛ వరి పొలం గట్ల మీద కంచె పంటలుగా బంతి మొక్కలను నాటి నులిపురుగుల ఉద్ధృతిని తగ్గించవచ్చు.
☛ పత్తి చేను చుట్టూ కంచెగా సజ్జ, జొన్న, మొక్కజొన్నను 3-4 వరుసల్లో వేస్తే బయటి పురుగులు రాకుండా ఆపవచ్చు.
☛వేరుశనగలో జొన్న, సజ్జ కంచె పంటలుగా వేస్తే రసం పీల్చే పురుగులు, తిక్కా ఆకుమచ్చ తెగులు ఉద్ధృతి తగ్గుతుంది.
☛ మొక్కజొన్న చుట్టూ 4, 5 వరుసల ఆముదపు మొక్కలను దగ్గరగా వేస్తే అడవి పందుల నుంచి పంటను కాపాడుకోవచ్చు.
Similar News
News September 23, 2025
దుల్కర్, పృథ్వీరాజ్ ఇళ్లల్లో కస్టమ్స్ సోదాలు

హీరోలు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ నివాసాల్లో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. స్మగ్లింగ్ ఆరోపణలపై ‘ఆపరేషన్ నుమ్‌ఖోర్’ పేరుతో కేరళ వ్యాప్తంగా సోదాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కొచ్చిలోని దుల్కర్, పృథ్వీరాజ్ నివాసాల్లో వాహనాల పత్రాలు పరిశీలించారు. పన్ను తప్పించుకునేందుకు భూటాన్ నుంచి లగ్జరీ కార్లను సెకండ్ హ్యాండ్ కార్లుగా కేరళ తెచ్చారన్న సమాచారంతో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
News September 23, 2025
GSTతో రాష్ట్రానికి రూ.7 వేల కోట్ల నష్టం: పొన్నం

TG: ప్రజలను దోచుకునేందుకు GSTని కేంద్రం ఆయుధంగా వాడుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ‘GST అంటే గబ్బర్‌సింగ్ ట్యాక్స్ అని రాహుల్ గాంధీ ఎప్పుడో చెప్పారు. శవపేటికలపై కూడా కేంద్రం ట్యాక్స్ విధించింది. 8 ఏళ్లు ప్రజలను దోచుకుంది. ఇప్పుడు ఆర్థిక సంక్షోభం నుంచి తప్పించుకోవడానికి GST తగ్గించింది. దీంతో రాష్ట్రానికి రూ.7వేల కోట్ల నష్టం వాటిల్లుతుంది. దాన్ని కేంద్రమే పూడ్చాలి’ అని డిమాండ్ చేశారు.
News September 23, 2025
ఈ అలవాట్లు అందానికి శత్రువులు

మచ్చలు లేకుండా అందంగా మెరుస్తూ ఉండే చర్మం కావాలని ప్రతి అమ్మాయీ కోరుకుంటుంది. అయితే దీనికోసం కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు చర్మనిపుణులు. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారం, పాల ఉత్పత్తులు మితంగా తీసుకోవాలి. చక్కెర, జంక్ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. ఎవరో చెప్పారని చర్మంపై ప్రయోగాలు చెయ్యకూడదు. కంటినిండా నిద్ర చర్మ ఆరోగ్యానికి చాలా ముఖ్యం. పడుకొనే ముందు మేకప్ తొలగించాలి. నీరు ఎక్కువగా తాగాలి.