News September 23, 2025

SBIలో స్పెషలిస్ట్ పోస్టులు

image

<>SBI <<>>15 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈ నెల 29వరకు అప్లై చేసుకోవచ్చు. వీటిని కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు. బీఈ/బీటెక్ లేదా ఎంసీఏ/ఎంటెక్/ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://sbi.bank.in/

Similar News

News September 23, 2025

‘OG’లో అకీరానందన్?

image

పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమాలో ఆయన కుమారుడు అకీరానందన్ నటించినట్లు చర్చ జరుగుతోంది. కత్తిపై ఓ కుర్రాడి కళ్లు కనిపించగా.. అవి అకీరావేనని ఫ్యాన్స్ అంటున్నారు. కచ్చితంగా ఎంట్రీ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. అలాగే ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్ పక్కన రాహుల్ రవీంద్రన్ నటించగా ఎడిటింగ్‌లో ఆ పాత్రను తొలగించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. అది దర్శకుడి నిర్ణయమని ఓ ఫ్యాన్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు.

News September 23, 2025

కర్ణాటకలో కాంగ్రెస్ ఉన్నా వెనక్కి తగ్గం: ఉత్తమ్

image

TG: కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచేదే లేదని ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో చెప్పారు. ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా తాము వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. నీటి హక్కులు సాధించడంలో ఎంతవరకైనా పోరాడతామని తెలిపారు. కృష్ణా, గోదావరి జలాలపై రాజీ పడే ప్రసక్తే లేదని మంత్రి తేల్చి చెప్పారు.

News September 23, 2025

దుల్కర్, పృథ్వీరాజ్ ఇళ్లల్లో కస్టమ్స్ సోదాలు

image

హీరోలు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ నివాసాల్లో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. స్మగ్లింగ్ ఆరోపణలపై ‘ఆపరేషన్ నుమ్‌ఖోర్’ పేరుతో కేరళ వ్యాప్తంగా సోదాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కొచ్చిలోని దుల్కర్, పృథ్వీరాజ్ నివాసాల్లో వాహనాల పత్రాలు పరిశీలించారు. పన్ను తప్పించుకునేందుకు భూటాన్ నుంచి లగ్జరీ కార్లను సెకండ్ హ్యాండ్ కార్లుగా కేరళ తెచ్చారన్న సమాచారంతో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.