News September 23, 2025

మేడారం చరిత్రలో తొలిసారి.. జాతరకు ముందే CM రాక

image

మేడారం మహాజాతర చరిత్రలో కొత్త అంశం చేరనుంది. 4 రోజులపాటు జరిగే ఈ ‘జనజాతర’కు రాష్ట్ర ముఖ్యమంత్రులు రావడం పరిపాటే. మేడారం జాతరను 1996లో రాష్ట్ర పండుగగా గుర్తించిన తర్వాత అమ్మల దగ్గరకు CMల రాక మొదలైంది. కాగా, ఇది ఆచారంగా మారి CMలందరూ జాతర టైంలో వచ్చి తల్లులను దర్శించుకుంటున్నారు. కానీ, తొలిసారిగా CM రేవంత్ జాతరకు ముందే వచ్చి జాతర నిర్వహణపై సమీక్షించనున్నారు. దీంతో మేడారం అభివృద్ధిపై అంచనాలు పెరిగాయి.

Similar News

News September 23, 2025

వరంగల్: పెరిగిన చిరుధాన్యాల ధరలు

image

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే మంగళవారం చిరుధాన్యాల ధరలు పెరిగాయి. సూక పల్లికాయ క్వింటా నిన్న రూ.6,000 ధర పలకగా.. నేడు రూ.6,500 ధర వచ్చింది. అలాగే పచ్చి పల్లికాయకి నిన్న రూ.3,300 ధర వస్తే.. నేడు రూ.4,500 అయింది. మక్కలు(బిల్టీ)కి నిన్న రూ.2,215 ధర రాగా.. నేడు రూ.2,230 వచ్చింది. మరోవైపు దీపిక మిర్చి రూ.14 వేలు, ఎల్లో రకం మిర్చి రూ.22 వేలు, పసుపు(MB) రూ.7560 ధర పలికాయి.

News September 23, 2025

పబ్లిసిటీ అసిస్టెంట్ పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

image

ఖమ్మం జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయంలో పబ్లిసిటీ అసిస్టెంట్ (వీడియో కెమెరామెన్) పోస్టును ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏదైనా డిగ్రీ అర్హత గల అభ్యర్థుల నుంచి ఈనెల 25లోగా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని చెప్పారు. AP/TG స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్&ట్రైనింగ్ ద్వారా జారీ చేసిన సినీ ఫోటోగ్రఫీ అర్హత ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు.

News September 23, 2025

MLG: CM మీటింగ్.. తాగునీరు లేక అల్లాడుతున్న మహిళలు

image

తాడ్వాయి మండలం మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా వేల సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. సుమారు 3 గంటలకు పైగా వేచి ఉన్న తమకు కనీసం తాగునీరు, స్నాక్స్ కూడా ఇవ్వడం లేదని మహిళలు వాపోయారు. దాహం, ఆకలితో అలమటిస్తున్నామన్నారు. ఎవరిని అడిగినా కనీసం మంచినీరు ఇవ్వడం లేదని, ఉక్కపోత, దప్పికతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.