News September 23, 2025
GST అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ సస్పెండ్ !

అమరావతి ప్రాంతం వరద్దల్లో మునిగిపోయిందని GST అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ FB వ్యక్తిగత ఖాతాలో పోస్ట్ చేశారు. ఇదే మన డ్రోన్ కేపిటల్, క్వాంటంవాలీ, అతిపెద్ద రైల్వేస్టేషను, అతిపెద్ద విమానాశ్రయం కట్టే రాజధాని అంటూ సెటైర్లు విసిరారు. FB పోస్ట్‌ను సీరియస్‌గా తీసుకున్న AP ప్రభుర్వం వివరణ కోరుతూ మెమో జారీ చేసింది. వివరణలో పోస్ట్ నా వ్యక్తిగతం అంటూ సుభాష్ సమాధానం ఇవ్వగా ప్రభుత్వం సస్పెండ్ చేసినట్లు సమాచారం.
Similar News
News September 23, 2025
సిద్దిపేట: ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ ముఖ్యం: CP

యూనిఫామ్ వేసుకున్న ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ ముఖ్యమని సీపీ అనురాధ అన్నారు. మంగళవారం కమీషనర్ కార్యాలయంలో హోంగార్డ్ సిబ్బందితో క్షేత్రస్థాయిలో సమావేశం నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. హోమ్ గార్డ్స్ పోలీస్ శాఖలో అంతర్భాగమే అని, వారి సంక్షేమానికి ఎల్లవేళలా కృషి చేస్తామని అన్నారు. సివిల్ వివాదాలలో తల దూర్చద్దని సూచించారు. ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ తదితరులు ఉన్నారు.
News September 23, 2025
ఈ ఆహారంతో క్యాన్సర్ దరిచేరదు: వైద్యులు

పీచు పదార్థాలు నిండిన ఆహార పదార్థాలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ‘పప్పులు, బీన్స్, చిరుధాన్యాలు, నట్స్, ఆకుకూరల్లో పీచు పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి పేగు బ్యాక్టీరియాను పోషిస్తాయి. శరీరంలో వాపును తగ్గించే సమ్మేళనాలను ఇవి ఉత్పత్తి చేస్తాయి. పీచు పేగులోని వ్యర్థాలను తొలగించి హానికర క్యాన్సర్‌ను నిరోధిస్తాయి. బరువు, రక్తంలోని చక్కెరను నియంత్రిస్తాయి’ అని సూచించారు.
News September 23, 2025
వర్గల్: రేపు సరస్వతి ఆలయానికి ఎమ్మెల్సీ కవిత రాక

ప్రసిద్ధ వర్గల్ శ్రీ విద్యా సరస్వతి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం క్షేత్రాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఆమె అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితులను సత్కరించి ఆశీర్వచనాలు పొందనున్నారు. కాగా దేవి నవరాత్రుల్లో ఎమ్మెల్సీ కవిత రావడం ఇదే మొదటిసారి.